Political News

ఒకే ఫ్రేములో చిరు రజని బాలయ్య

కొన్ని సందర్భాలు అరుదైన కలయికలు సృష్టిస్తాయి. ఇవాళ జరుగుతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకార మహోత్సవం అరుదైన జ్ఞాపకాలకు వేదికగా మారుతోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్ లను ఒకే వేదిక మీద చూడటం అభిమానులకు అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది.

స్టేజి మీద వచ్చిన అతిథులకు సాదరంగా స్వాగతం పలికి వాళ్ళను కేటాయించిన కుర్చీలవైపు పంపించే బాధ్యతను తీసుకున్న బాలయ్య ముందు చిరంజీవితో కరచాలనం చేయడం, ఆ తర్వాత రజనీకాంత్ దంపతులకు వెల్కమ్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.

చిరు, బాలయ్య, రజిని, లతలకు ఒకే చోట ఆసనాలు కేటాయించారు. బాలకృష్ణ దగ్గరుండి ఇబ్బందేమీ కలగలేదు కదాని రజనిని అడిగి తెలుసుకోవడం, అలాంటిదేమి లేదని తలైవర్ స్పష్టం చేయడం కనిపించింది. ఆ తర్వాత రజని చిరు ఇద్దరూ ముచ్చట్లలో పడిపోయారు.

వచ్చిన జన సందోహం గురించి, ఏర్పాట్లు వగైరాల గురించి మాట్లాడుకోవడం లైవ్ లో ఫ్యాన్స్ చూస్తూనే ఉన్నారు. ఇలా ఈ ముగ్గురు ఒకేసారి ఎప్పుడు కలుసుకున్నారంటే సమాధానం చెప్పడం డౌటే. కనీసం రెండు మూడు దశాబ్దాలు వెనక్కు వెళ్లినా గుర్తు చేసుకోవడం కష్టం. అందుకే బెస్ట్ మెమరీగా ఉండిపోతుంది.

విశిష్ట అతిథులుగా వచ్చిన చిరు, రజనిలతో పాటు నారా రోహిత్, నిఖిల్, దర్శకుడు క్రిష్ తదితరులు వచ్చిన గెస్టుల్లో ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. కేవలం రాజకీయానికి మాత్రమే పరిమితం అవ్వాల్సిన ఇలాంటి వేడుక ఈసారి సినీ రంగంపరంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

పవన్ కళ్యాణ్ ఒక కారణమైతే చంద్రబాబునాయుడు గతంలో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి అందించిన సహకారం మరొకటి. సినిమాలు తప్ప వేరే ప్రపంచం లేకుండా ఉండే సగటు అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుక మొత్తాన్ని చూడటం అరుదనే చెప్పాలి.

This post was last modified on June 12, 2024 11:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టీడీపీలో సీనియ‌ర్ల రాజ‌కీయం.. బాబు అప్ర‌మ‌త్తం కావాలా?

ఏపీలోని కూట‌మి స‌ర్కారులో కీల‌క పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కుల వ్య‌వ‌హారం కొన్నాళ్లుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. సీనియ‌ర్లు స‌హ‌క‌రించ‌డం…

15 minutes ago

రేవంత్ సర్కారు సమర్పించు ‘మహా’… హైదరాబాద్

కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…

1 hour ago

లెక్క‌లు తేలుస్తారా? అమిత్ షాకు చంద్ర‌బాబు విన్న‌పాలు ఇవీ!

ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా వ‌ద్ద ఏపీ సీఎం చంద్ర‌బాబు…

2 hours ago

స‌స్పెండ్ చేస్తే.. మాతో క‌ల‌వండి: టీడీపీ నేత‌కు వైసీపీ ఆఫ‌ర్‌?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం. రాజ‌కీయాలు రాజ‌కీయాలే. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ఎన్టీఆర్ జిల్లాలోనూ జ‌రుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…

3 hours ago

షా, బాబు భేటీలో వైఎస్ ప్రస్తావన

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…

4 hours ago

టీడీపీపై తెలంగాణకు ఆశ చావలేదు!

అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…

5 hours ago