ఏపీలో గత చంద్రబాబు పాలనలో పేదలకు రూ.5కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం లేదా ఫలహారం అందించిన అన్న క్యాంటీన్లు పేదలకు గుర్తుండిపోయాయి. పనులు చేసుకునే వారికి నిత్యం వివిధ వృత్తుల్లో ఉన్నవారికి, విద్యార్థులకు, హాకర్లకు ఈ క్యాంటీన్లు అత్యంత కారు చౌకకే కడుపు నింపాయి. అయితే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనిగట్టుకుని ఈ క్యాంటీన్లను తీసేశారు. దీంతో పేదలకు కడుపు మండింది.
ఇక, ఇప్పుడు కూటమి సర్కారు రావడంతోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, తిరుపతి, విశాఖ, గుంటూరు, అనంతపురం వంటి కీలకమైన 12 నగరాల్లో 350 క్యాంటీన్లు పనిచేశాయి. వీటిని ఇస్కాన్ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. పేదల నుంచి రూ.5 తీసుకుని మిగిలిన సొమ్ములో 50 శాతం ప్రభుత్వం, మిగిలిన సొమ్మును ఆయా నగర పాలక సంస్థలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో అన్నా క్యాంటీన్లు నిర్విఘ్నంగా సాగిపోయాయి.
అయితే.. వైసీపీ రావడంతో ఇవి ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో అప్పట్లో ఏర్పాటు చేసిన పాయింట్లలోనే 100 క్యాంటీన్లను ప్రారంభిం చాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. తద్వారా ఎన్నికల్లో ఇచ్చిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరుస్తామన్న హామీని నిలబెట్టుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. తాజాగా నటసింహం బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ క్యాంటీన్‌ను అధికారికంగా ప్రారంభించారు.
బాలయ్య మూడోసారి వరుసగా విజయం దక్కించుకున్న నియోజకవర్గం హిందూపురంలో సోమవారం అన్నా క్యాంటీన్‌ను టీడీపీ నాయకులు ప్రారంభించారు. సుమారు 200 మంది పేదలకు మధ్యాహ్నం నుంచి ఉచితంగానే అన్నం వడ్డించారు. ఈ నెల 12 నుంచి హిందూపురం మునిసిపల్ అధికారులు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా.. దృష్టి పెట్టారు. అయితే.. తొలివారం రోజులు వీటిని టీడీపీ నిర్వహించినా.. తర్వాత.. మునిసిపాలటీలకు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on June 10, 2024 8:55 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…