టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కోసం.. పెద్ద ఎత్తున 11 కార్లను కొనుగోలు చేసి కాన్వాయ్ కోసం వినియోగిస్తు న్నారంటూ.. వార్తలు వచ్చాయి. దీనిపై అదే సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. 11 కార్ల కోసం.. 12 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా? అంటూ.. కొందరు ప్రశ్నించారు.
దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు .. అధికారులు రంగంలోకి దిగారు. ఈ వార్తల్లో నిజం ఎంతో సరిచూసుకున్నారు. ఆ వెంటనే ఆయా వార్తలను ఖండించారు. టీడిపి అధినేత చంద్రబాబు కోసం తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆ పార్టీ సైతం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
“ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కొనుగోలు అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న వార్తలను అధికారులు ఖండించారు. కాన్వాయ్ కోసం వినియోగిస్తున్న వాహనాలన్నీ పాత వాహనాలే. ఎప్పటి నుండో వినియోగిస్తున్నవే అని స్పష్టం చేశారు.” అని టీడీపీ నేతలు పోస్టులో పేర్కొన్నారు. అయితే.. ఈ సోషల్ మీడియా పోస్టుల వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని గుర్తించారు.
చంద్రబాబు కాన్వాయ్ విషయంలో విదేశాల నుంచి కొందరు వైసీపీ నాయకులు పాత ఫొటోలను పోస్టు చేసి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని.. వీటిపై చర్యలు తీసుకోవాలని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇక, టీడీపీ నాయకులు కూడా.. ప్రస్తుతం చంద్రబాబుకు ఎలాంటి కాన్వాయ్ కొనుగోలు చేయడం లేదని.. ఉన్నవాటినే సర్దుకుంటారని తెలిపారు.
This post was last modified on June 10, 2024 6:26 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…