ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసర పల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. అదేవిధంగాపలు జాతీయ పార్టీల నాయకులు .. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టీడీపీ అబిమానులు పొటెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం లక్షమందికి పైగానే వస్తారని అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో లక్ష మందికి పైగా సరిపడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాఫీలు, టీల నుంచి టిఫిన్‌ల వరకు.. మధ్యాహ్నం భోజనాల ద్వారా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 9.27 గంటలకు చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 10 మంది వరకు మంత్రులు ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి వర్గ జాబితా రెడీ అయినట్టు సమాచా రం. తొలి దశలో కీలక నేతలు యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు సహా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రశాంతి(కోవూరు)కి చోటు దక్క నుందని తెలుస్తోంది. అలానే జనసేన, బీజేపీల నుంచి ప్రాథమికంగా ఇద్దరేసి చొప్పున ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.
ఇక, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేయింబవళ్లు కార్మికులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఐదుగరు ఐఏఎస్ అధికారుల పర్యవేక్ష ణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులతోపాటుగా దాదాపు లక్ష మందికిపైగా ప్రజలు వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో 80 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మిగిలిన వారు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
మహానాడును తలపించే విందు
టీడీపీ నిర్వహించే మహానాడులో విందుకు ప్రత్యేకత ఉంది. ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి టిఫిన్లతోపాటు.. మధ్యాహ్నం 11 గంటల నుంచి భోజనాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు లక్ష మందికి భోజనాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే.. బస ఏర్పాట్లకు కూడా.. ప్రత్యక చర్యలు తీసుకుంటున్నారు.
This post was last modified on June 10, 2024 9:09 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…