Political News

అంద‌రి చూపూ ఆ…1 పైనే…!

అవును. ఇప్పుడు అంద‌రి చూపూ జూలై 1వ తేదీపైనే ఉంది. నిజానికి.. ఈ నెల 4వ తేదీపై ఎంత ఉత్కంఠ నెల‌కొందో.. ఇప్పుడు అంద‌రూ అదే ఉత్కంఠ‌తో జూలై 1వ తేదీ కోసం వేచి చూస్తున్నారు. దీంతో అస‌లు ఏం జ‌రుగుతోంది? అనే చ‌ర్చ ఆసక్తిగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితా కోసం.. దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూశారు. ఇక‌,ఏపీలో అయితే.. మ‌రింత ఉత్కంఠ‌గా ఎదురు చూశారు. మొత్తంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. ఎక్క‌డా శ‌ష‌భిష‌లు లేకుండా.. ప్ర‌జ‌లు ఏక‌ప‌క్షంగానే తీర్పు చెప్పారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మ‌రోసారి జూలై 1వ తేదీ పై అంద‌రూ ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం చంద్ర‌బాబు.. ఇచ్చిన కీల‌క హామీ. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే జూలై 1వ తేదీనే సామాజిక పింఛన్లు పెంచుతామ‌ని హామీ ఇచ్చారు.

ఊరూ వాడా కూడా ఇదే ప్ర‌చారం చేశారు. తాజాగా వ‌చ్చిన ఓట్ల సునామీ వెనుక కీల‌క‌మైన కార‌ణం ఇదే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు ఇచ్చిన హామీ బాగా ప‌నిచేసి ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌ధానంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే పెంచిన పింఛ‌నును ఇస్తామ‌ని.. ఏప్రిల్‌, మే, జూన్ మాసాల‌కు క‌లిపి మూడు వేలు(వెయ్యి చొప్పున‌) జూలైలో 4000 పింఛ‌ను క‌లిపి.. మొత్తం రూ.7000ల‌ను ల‌బ్ధిదారుల‌కు ఇంటికే పంపిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

దీంతో వృద్ధులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఎక్కువ‌గా సైకిల్‌ పై ఆశ‌లు పెట్టుకుని ఉండి ఉంటార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు చేయాల్సిన తొలి ప‌ని ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. పింఛ‌ను దారుల్లో దాదాపు 40 ల‌క్ష‌ల మంది వీరే ఉన్నారు.

వీరికి ఒక్కొక్క‌రికీ రూ.7000 చొప్పున పింఛ‌నును జూలై 1వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, నిధులు చూస్తే.. అందుకు స‌హ‌క‌రించేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో రెండో త్రైమాసికం గడువు వ‌ర‌కు (అంటే..సెప్టెంబ‌రు వ‌ర‌కు) కూడా..జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉన్న లిమిట్ అప్పులు వాడేసింది. ఇప్పుడు ఖజానాలో అంత మేర‌కు సొమ్ములు ఉండే అవ‌కాశం లేదు. దీంతో చంద్ర‌బాబు ఈ కీల‌క హామీని ఎలా నెర‌వేరుస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది. మ‌రి చూడాలి.. ఏం చేస్తారో!!

This post was last modified on June 10, 2024 9:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

2 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

3 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

3 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

4 hours ago

రాష్ట్రం వెంటిలేట‌ర్ పై ఉంది: చంద్ర‌బాబు

రాష్ట్రం వెంటిలేట‌ర్‌పై ఉంద‌ని.. అయితే..దీనిని బ‌య‌ట‌కు తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా…

5 hours ago