తెలుగు నాట సూర్యోదయానికి ముందే ప్రతి ఇంటికీ పలకరించే ఈనాడు.. ప్రజల చేతిలో కరదీపికగా.. వారి సమస్యల పరిష్కారానికి.. పట్టుగొమ్మగా మారిన విషయం తెలిసిందే. ఏ చిన్న సమస్య అయినా.. ఈనాడు లో వస్తే.. పరిష్కారం ఖాయం అనే మాట అందరికీ తెలిసిందే. విరిగిపోయిన విద్యుత్ స్తంభం నుంచి పాడు బడిన మురుగు కాల్వ వరకు.. ఎవరూ పట్టించుకోరు.. అనే స్థాయి నుంచి ఈనాడులో ఈ సమస్యను ప్రస్తావిస్తే.. తక్షణం పరిష్కారం అవుతుందనే వరకు ఆ పత్రిక స్థాయిని పెంచారు రామోజీ.
అనారోగ్య కారణాలతో రామోజీ.. తన అవిశ్రాంత కష్టానికి విరామం ఇస్తూ.. శాస్వత నిద్రలోకి జారుకున్నారు. అయితే.. రామోజీ కన్న కలల్లో రెండు కీలక అంశాలు ఉన్నాయి. అవి నెరవేర్చుకునే సమయం కూడా ఆసన్నమైంది. కొద్ది నెలల కాలంలోనే ఆయన వాటిని పరిపూర్ణం చేసుకోవాలని అనుకున్నారు. కానీ, ఇంతలోనే ఆయన విశ్రమించారు. నిజానికి రామోజీనే చెప్పుకొన్నట్టు.. సవాళ్లులేని జీవితం ఉప్పులేని కూర వంటిది. అలానే ఆయన జీవితంలో ఏనాడూ సాధించిన దానికి సంతృప్తి చెందినా.. విశ్రమించలేదు.
ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్‌సిటీ వంటి.. బృహత్తర నగరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది టాటాలు, బిర్లలు, అంబానీలు, అదానీలకే సాధ్యం కాలేదు. వారు ప్రయత్నించి ఉంటే సాకారం అయ్యేదేమో.. తెలియదు. కానీ, ఈ దేశంలో ఎంతో మందిపారిశ్రామిక వేత్తలకు ఇళ్లు ఉన్నాయి. అంబరాన్నంటే.. విల్లాలు ఉన్నాయి.. కానీ, ఎక్కడా వారికి నగరాలు లేవు. దీనిని రామోజీ ఒక్కరే సాధించారు. అయితే.. దీంతో పాటు మరో రెండు కోరికలు కూడా.. ఉన్నాయి.
వాటిలో కీలకమైంది.. గత ఏడు సంవత్సరాలుగా అదే పనిలో ఉన్నది ఓం సిటీ
. దీనిని రామోజీ పిలిం సిటీలోనే 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని సుప్రశిద్ధ ఆలయాల నమూనాలను ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. కాశీ, రామేశ్వరం, తిరుమల, పూరిజగన్నాధుడు, అరలవిల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీశైలం, అయోధ్య ఇలా.. అనేక ఆలయాలను ఒకే చోట నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి ప్రత్యేక అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇవి.. పూర్తి కావొస్తున్నాయి. కానీ.. ప్రారంభించే సమయంలో రామోజీ వెళ్లిపోయారు.
అదేవిధంగా ఈనాడు ప్రారంభించి మరో రెండు మాసాలకు 50 ఏళ్లు పూర్తవుతాయి. దీనిని పెద్ద పండుగలా నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ, ఇంతలోనే ఆయన వెళ్లిపోయారు. ఈ రెండు కోరికలు కూడా.. రామోజీ తీర్చుకుని కనుల పండువగా వాటిని చూసి… చేసి.. మైమరిచి పోవాలని భావించారు. కానీ, సాకారం అయ్యేక్రమంలోనే ఆయన విశ్రమించారు.
This post was last modified on June 9, 2024 4:03 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…