Political News

రాజీకొచ్చిన విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌తో భేటీ!

కొడుకు, కూతురు మ‌ధ్య రాజ‌కీయంలో న‌లిగిపోవ‌డం కంటే దూరంగా ఉండ‌ట‌మే న‌య‌మ‌నుకున్న వైఎస్ విజ‌య‌మ్మ అమెరికా వెళ్లిపోయారు.

ఎన్నిక‌లు అయేంత‌వ‌ర‌కూ ఇక్క‌డికి రాని విజ‌యమ్మ తాజాగా జ‌గ‌న్ ఇంటికి వ‌చ్చార‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌చారం చేస్తున్నాయి. ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాభ‌వంతో ఢీలా ప‌డ్డ జ‌గ‌న్‌ను ఓద‌ర్చ‌డంతో పాటు చెల్లి ష‌ర్మిల‌తో రాజీ చేసుకోమ‌ని చెప్పేందుకు విజ‌య‌మ్మ ప్ర‌యత్నిస్తున్న‌ట్లు తెలిసింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 11 సీట్ల‌తో పాతాళానికి ప‌డిపోయిన వైసీపీ పుంజుకోవాలంటే చాలా క‌ష్టం. ఈ నేప‌థ్యంలో పార్టీ భ‌విష్య‌త్ గురించి జ‌గ‌న్ తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం కేంద్రంగా ఆస‌క్తిక‌ర రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. పార్టీ ఓట‌మికి కార‌ణాలను జ‌గ‌న్ విశ్లేషిస్తున్నార‌ని తెలిసింది.
టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మితో పాటు చెల్లి ష‌ర్మిల‌, సునీత కూడా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేశారు. వైసీపీ ఓట‌మి కోసం గ‌ట్టిగా ప‌నిచేశారు. ఏపీ పీసీసీ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల కాంగ్రెస్ పార్టీ విజ‌యం కోసం ప‌నిచేశారు.

ఎన్నిక‌ల ప్ర‌చారానికి ముందు జ‌గ‌న్‌ను ఆశీర్వదించిన విజ‌య‌మ్మ‌.. జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య న‌ల‌గ‌లేక అమెరికా వెళ్లిపోయార‌నే అభిప్రాయాలు వినిపించాయి. అక్క‌డి నుంచి ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా ఆమె ఓ వీడియో కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. కానీ క‌డ‌ప ఎంపీగా ష‌ర్మిల ఓడిపోయారు. మ‌రోవైపు జ‌గ‌న్ పార్టీ దారుణంగా ప‌రాజ‌యం పాలైంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ నివాసానికి వ‌చ్చిన విజ‌య‌మ్మ‌.. త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల మ‌ధ్య దూరం పెర‌గ‌డంపై ఆవేద‌న‌తో ఉన్న‌ట్లు తెలిసింది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు టాక్‌. కానీ జ‌గ‌న్ తిరిగి చెల్లిని ఆహ్వానిస్తారా? అన్న‌తో క‌లిసి ష‌ర్మిల ప‌ని చేస్తారా? అన్న‌వి ఇప్ప‌టికైతే స‌మాధానం లేని ప్ర‌శ్న‌లే.

This post was last modified on June 10, 2024 9:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago