36 ఏళ్ల అత్యంత చిన్న వయసులో నేడు మోడీ క్యాబినెట్ లో యువ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై పోటీ చేసి 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచాడు. రామ్ మోహన్ నాయుడు మాజీ కేంద్రమంత్రి ఎర్రనాయుడు కుమారుడు.
తన కెరీర్ కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవితం హఠాత్తుగా ప్రారంభమైంది. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2014 లో శ్రీకాకుళం నుండి రామ్మెహన్ నాయుడు లోక్‌సభ ఎంపీగా మొదటి సారి గెలిచాడు. అప్పటికి రామ్మోహన్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు. ఈ విజయంతో 16వ లోక్‌సభలో రెండో అతి పిన్న వయస్కుడైన ఎంపీగా తనదైన ముద్ర వేశారు. రామ్ మోహన్ చంద్రబాబు నాయుడుకు అత్యంత విధేయుడిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్టయ్యాక ఢిల్లీలో నారా లోకేష్‌తో పాటు రామ్మోహన్ కీలక పాత్ర పోషించారు. రామ్ మోహన్‌ను 2020 సంవత్సరంలో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.
మొదటి నుంచి చదువులో నైపుణ్యం
రామ్ మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు. అతని ప్రారంభ విద్యాభ్యాసం ఆర్కే పురంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి, తరువాత అతను పర్డ్యూ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో అతను లాంగ్ ఐలాండ్ నుండి ఎంబీఏ పట్టా తీసుకున్నాడు.
అతను 2017 సంవత్సరంలో శ్రీ శ్రావ్యను వివాహం చేసుకున్నాడు. 2021 సంవత్సరంలో అతను ఒక కుమార్తెకు తండ్రి అయ్యాడు. రామ్ మోహన్ ఈసారి అత్యంత పిన్న వయస్సుగల క్యాబినెట్ మంత్రి.
This post was last modified on %s = human-readable time difference 2:53 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…