బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టబోతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మోదీ 3.0’ ప్రభుత్వం ఈ రోజు కొలువుదీరనుంది. ఈ రోజు రాత్రి 7.15 గంటలకు భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆ వెంటనే బీజేపీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 30 మంది ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ రోజు మోడీతోపాటు కేంద్ర మంత్రులుగా ఎవరెవరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నది తేలాల్సి ఉంది. పూర్తి స్థాయి మోడీ కేబినెట్ లో 78 నుంచి 81 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇక, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న పార్టీలలో కీలకంగా మారిన టీడీపీ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ మంత్రి పదవి దక్కగా, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కనుంది.
బీజేపీ నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మ కు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఈ ముగ్గురూ ప్రధానితో ఈ రోజే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే రామ్మోహన్‌నాయుడుకి, పెమ్మసానికి ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు దక్కింది. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు పిలుపు అందింది. పీఎంవో నుంచి పిలుపు రావడంతో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మోదీ నివాసానికి వెళ్లారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకొని మంచి ఫలితాలు సాధించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బ్రహ్మాండమైన మెజార్టీతో విజయం సాధించారు.
This post was last modified on June 9, 2024 2:15 pm
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…