ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో మోడీ 400 సీట్లు తమకు రాబట్టుకుంటామని చెప్పుకొచ్చారు. కానీ, ఆ మేరకు ఆయన రాబట్టుకోలేకపోయారు. అంతేకాదు. గత 2019 ఎన్నికల్లో బీజేపీకి ఒక్క పార్టీకే. 303 సీట్లు వచ్చాయి. మిత్రపక్షాలతో కలిసి.. ఇది 400 దాటి పోయింది. దీంతో ఇప్పుడు కూడా. తమకు సీట్లు వస్తాయని అనుకున్నారు. కానీ, ఆమేరకు రాలేదు . సరికదా.. అసలు బీజేపీకి 240 దగ్గరకే ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో బీజేపీ నేతలు , కేంద్ర మంత్రులు చాలా మంది ఓడిపోయారు.
ఈ పరిణామాలు ఒకరకంగా.. మోడీని, బీజేపీ నేతలను కూడా అంతర్మథనంలో పడేసేవే. అయితే.. ఆ మేరకు.. ఎక్కడా వారిలో ఈ చీకు, చింత కనిపిస్తున్నట్టు లేదు. పైగా.. మోడీ మరోసారి ఎదురు దాడి చేయ డం.. అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇంకా ప్రధానిగా ఆయన మూడోసారి పగ్గాలు చేపట్టక ముందే.. కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ, చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీని ఆదరించారు” అని చెప్పుకొచ్చారు.
నిజానికి బీజేపీకి పెరిగింది… తెలంగాణలో ఓట్లు, సీట్లు మాత్రమే. కర్ణాటకలో మాత్రం ఆ పార్టీ సీట్లు , ఓట్లు కూడా.. కోల్పోయింది. ఈ విషయం దాచేసి.. కాంగ్రెస్‌పై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేయడం గమనార్హం. అంతేకాదు… ఎన్టీయే 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని మోడీ చెప్పారు. కానీ, వీటిలో 7 రాష్ట్రాల్లో.. ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రభుత్వాలను దించేసి.. మధ్యంతరంగా బీజేపీ ఇతర పార్టీలతో జత కట్టి.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని మోడీ దాచేసి.. వాటిని తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇక, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 7 చోట్ల కూడా తామే అధికారంలో ఉన్నామన్నారు. కానీ, ఇక్కడ కూడా.. ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇతర పక్షాలను ఏకం చేసి.. ప్రజలు ఇచ్చిన తీర్పు పక్కన పెట్టి.. అధికారంలోకి వచ్చారు. అయితే.. ఇప్పుడు కీలక సమయంలో మరోసారి మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై.. విమర్శలు వస్తున్నాయి. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం.. మేనిఫెస్టోలను అమలు చేయడం .. మిగిలి ఉన్నాయని చెబుతున్నారు.
This post was last modified on June 7, 2024 5:18 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…