అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఓడలు బడ్లవడం.. బడ్లు ఓడలవడం రాజకీయాల్లో కామనే. ఎంతటి మహామహులకైనా ప్రజల చేతుల్లో ఓటమి తప్పలేదు. అధికారంలో ఉన్నామని విర్రవీగితే పాతాళానికి పడిపోవడం ఖాయం. ఇక అధికారంలోని ప్రభుత్వం అండ చూసుకుని రెచ్చిపోయే అధికారులు కూడా కాలం ఒకేలా ఉండదు అని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏపీలోని ఇలాంటి కొంతమంది అధికారులు ఇప్పుడు వణికిపోతున్నారని తెలిసింది.
జగన్ అండతో, ఆదేశాలతో పోలీసులు, అధికారులు రెచ్చిపోయారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అన్యాయంగా అరెస్టు చేశారనే అభిప్రాయాలున్నాయి. అంతే కాకుండా జగన్‌ను చూసుకుని అధికార పార్టీ నేతలకు కొమ్ము కాశారనే విమర్శలున్నాయి. ఇప్పుడు ఇలాంటి అధికారులందరూ హడలెత్తిపోతున్నారు. కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లోని చేతిలోని రెడ్‌బుక్. జగన్ అండతో టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, జనాలను అన్యాయంగా వేధిస్తున్న వాళ్ల పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నానని లోకేశ్ గతంలో చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
లోకేశ్ పేర్లు రాసుకుంటే ఏముంది? అసలు టీడీపీ అధికారంలోకి రావాలి కదా? అని ఆ అధికారులు మరింత బరితెగించారు. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంతో ఈ అధికారుల కాళ్ల కింద భూమి కంపించిందనే టాక్ వినిపిస్తోంది. ఎక్కడ తమపైన చర్యలు తీసుకుంటారో అని ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఈ అధికారులు క్యూ కడుతున్నట్లు తెలిసింది. జగన్ ఒత్తిడితోనే అలా వ్యవహరించామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. కానీ బాబు మాత్రం వీళ్లను అసలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఈ అధికారులపై చర్యలు తీసుకునేందుకు లోకేశ్ సిద్ధమవుతున్నారని తెలిసింది.
This post was last modified on June 7, 2024 3:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…