కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాం.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం.. ఇవీ ఒకప్పుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. కానీ కట్ చేస్తే ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన షాక్ తగిలింది. ఇప్పుడేమో లోక్‌సభ ఎన్నికల్లో సున్నాతో ఘోర పరాభవం మిగిలింది. ఆ పార్టీని జనాలు పట్టించుకోవడం మానేశారనేందుకు ఇదే నిదర్శనం. దీంతో బీఆర్ఎస్‌లో ఇంకేముంది? పార్టీ మారితేనే తమ రాజకీయ కెరీర్ నిలబడుతుందని ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో అయితే 17 స్థానాల్లో పోటీ చేసినా సున్నాకే పరిమితమైంది. ఇదే సమయంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన కాంగ్రెస్.. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ విజయం సాధించింది. బీజేపీ కూడా 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఓ వైపు వరుస పరాభవాలు, మరోవైపు వివిధ కేసుల్లో అగ్రనేతల పేర్లు.. ఇలా బీఆర్ఎస్ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది.
ఓ వైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు జాకీ పెట్టి లేపిన ఇప్పట్లో పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఇన్ని రోజులూ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన రేవంత్ ఇప్పుడు చేరికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుదిరితే కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్లేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.
This post was last modified on June 7, 2024 1:43 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…