Political News

అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడింది ?

కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నది. 2019 లోక్ సభ ఎన్నికలలో యూపీలో 62 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికలలో కేవలం 33 స్థానాలకు పరిమితమయింది. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ 37, కాంగ్రెస్ 6, ఆర్ఎల్డీ 2, ఆజాద్ సమాజ్ పార్టీ 1, అప్నా దళ్ ఒక స్థానం గెలుచుకుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రామమందిరం నిర్మించిన అయోధ్య ఉన్న ఫైజాబాద్ లో బీజేపీ ఓటమి దేశవ్యాపితంగా చర్చానీయాంశం అయింది.

ఇక్కడ బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో 54567 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. అయోధ్య రామమందిరం పేరుతో అనేక రాష్ట్రాలలో విజయం సాధించిన బీజేపీ అక్కడ ఓడిపోవడం గమనార్హం. రామమందిరం నిర్మాణం కోసం సేకరించిన భూములను నష్టపోయిన బాధితులకు సరైన పరిహారం ఇవ్వకపోవడం మొదటి కారణంగా చెబుతున్నారు. అంతేకాకుండా భూములు తీసుకున్న వారి మీద అక్రమ కేసులు పెట్టడం కారణమైంది.

బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్ ఎన్నికల ప్రచారంలో ‘అంబేద్కర్ పుట్టిన రోజున రాజ్యాంగాన్ని మారుస్తామని, రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీకి 400 స్థానాలలో గెలిపించాలని’ అన్నారు. ఇది ఇక్కడ ఉన్న 28 శాతం ఓబీసీలకు రుచించలేదన్నది రెండో కారణంగా చెబుతున్నారు. అందుకే అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను పార్టీ అధిష్ఠానం పక్కకు పెట్టిందని తెలుస్తుంది. రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం తెలిపినప్పటికీ, 62 సిట్టింగ్‌ స్థానాల్లో 55 మందికి అధిష్టానం టికెట్లు ఇవ్వడమూ యూపీలో ఓటమికి కారణం అని చెబుతున్నారు.

This post was last modified on June 7, 2024 3:26 pm

Share

Recent Posts

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

1 hour ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

3 hours ago

పాపం అల్లు శిరీష్.. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…

4 hours ago

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

4 hours ago

రిక్షా తోలుకోమంటున్న డిప్యూటీ సీఎం…

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…

5 hours ago

ఆ రోడ్డుపై వైసీపీ దుష్ప్రచారం.. ఖండించిన డిప్యూటీ సీఎంవో

ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…

6 hours ago