హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి బీజేపీ లోక్ సభ సభ్యురాలు, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు చండీగఢ్ విమానాశ్రయంలో చేధు అనుభవం ఎదురయింది. ఢిల్లీ వెళ్లేందుకు చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకున్నానని.. ఈ సమయంలో సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత బోర్డింగ్ కోసం వెళుతున్నప్పుడు LCT కుల్విందర్ కౌర్ (CISF యూనిట్ చండీగఢ్ ఎయిర్‌పోర్ట్) చెంపదెబ్బ కొట్టినట్లు కంగనా రనౌత్ ఆరోపించారు. రైతుల ఉద్యమాన్ని అవమానించారని దూషిస్తూ తనపై దాడి చేశారని కంగనా రనౌత్ అన్నారు. ఈ మేరకు కంగనా ఫిర్యాదులో పేర్కొన్నారు.
కంగనా రనౌత్‌పై దాడి చేసిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. సీనియర్ అధికారుల సమక్షంలో, ఆమె ఈ సంఘటన గురించి సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌కు ఫిర్యాదుచేశారు. చండీగఢ్ విమానాశ్రయంలోని కర్టెన్ ఏరియాలో కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ తనతో వాదించి చెంపదెబ్బ కొట్టారని కంగనా వెల్లడించారు.
కానిస్టేబుల్ కుల్విందర్‌ను అరెస్టు చేసిన పోలీసులు సీఓ గదిలో నిర్బంధించి విచారణ కొనసాగిస్తున్నారు. చండీగఢ్ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను సైతం పరిశీలిస్తున్నారు. మండి లోక్ సభ స్థానంలో కంగనా 70 వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.
This post was last modified on June 6, 2024 9:45 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…