ఏపీలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. అనూహ్యమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం విలువ లేకుండాపోయిందని.. సర్వం.. ధనుంజయరెడ్డే అన్నట్టుగా ఓ కీలక ఐఏఎస్ వ్యవహరించారని.. తెలుస్తోంది. ఆయన కారణంగానే ఎమ్మెల్యేలకు.. జగన్ దగ్గర కనీసం గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా చిక్కలేదని.. ఫలితంగా తమ తమ నియోజకవర్గాల్లో పనులు నిలిచిపోయి.. ప్రజల ఆగ్రహానికి ఇది కూడా ఒక కారణమై ఉంటుందని.. రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ఓటమిని విశ్లేషించారు.
ప్రజలకు ఎన్నో చేశాం. ఎన్నెన్నో మంచి పనులు చేశాం. ఇంటింటికీ వలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇంత మంచి చేసిన మమ్మల్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో.. మాకు అర్థం కావడం లేదు. మేం తప్పు చేశామా.? లేక.. ప్రజలే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తప్పు చేశారా? మేం ఆలోచించుకుంటాం అని రాజా అన్నారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టించానని చెప్పారు. అనేక పనులు చేయించానన్నారు. ఏ గ్రామం తీసు కున్నా.. తాను చేయించిన పనులు కనిపిస్తాయని చెప్పారు. కావాలంటే.. ఎవరైనా దీనిని పరిశీలించుకోవాలని సూచించారు.
ఇక, సీఎంవో వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ఒక దరిద్రమైన అధికారి ఉన్నాడు. ఆయనే ధనుంజయరెడ్డి. ఎక్కడ నుంచో తెచ్చి.. ఇక్కడ పెట్టారు. ప్రతిదానికీ ఆయన తానే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరించారు. ఎమ్మెల్యేలు ఏదైనా పనులపై ఆయన దగ్గరకు వెళ్తే.. గంటల తరబడి నిలబెట్టేవాడు. ముఖ్యమంత్రి ని కలిసేందుకు కూడా ఇబ్బంది పడేవాళ్లం . కనీసం కలిసినా.. చెప్పిన పనిని మళ్లీ ధనుంజయ రెడ్డికి అప్పగించేవారు. ఆయన చూద్దాం.. చేద్దాం.. అంటూ ఐదేళ్లు గడిపేశాడు అని రాజా వ్యాఖ్యానించారు.
తన సొంత నియోజకవర్గానికి చెందిన పనుల కోసం ప్రతి మంగళవారం.. విజయవాడ వెళ్లి మకాం వేసి.. అక్కడ నుంచి సీఎంవో కార్యాలయానికి వెళ్లి.. కలిసే ప్రయత్నం చేశామని.. కానీ, ఏ పనిచెప్పినా.. ధనుంజయరెడ్డే చూసారని అన్నారు. కానీ, పనులు చేసేవారు కాదన్నారు. దీంతో విదేశీ విద్యాదీవెన బిల్లులు.. ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లుల కోసం ఎన్ని సార్లు అర్జీలు పెట్టినా.. చేయలేదని విమర్శించారు. ఒక పిల్లాడికి రూ.15000 అమ్మ ఒడి ఇస్తే.. రాష్ట్రం శ్రీలం క అయిపోతుందన్న పార్టీలకు ప్రజలు ఓట్లెలా వేశారో .. అంతు పట్టడం లేదన్నారు. మోసం చేస్తేనే ఆదరిస్తారా? మోసం చేయడం మాకు చేతకాలేదు అన్నారు.
This post was last modified on June 6, 2024 7:10 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…