టీడీపీ యువ నాయకుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పార్టీని విజయ తీరాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. యువగళం పాదయాత్ర ద్వారా.. పార్టీని బలోపేతం చేశారు.
ఎన్నికల ప్రచారంలోనూ దూకుడుగా ముందుకు సాగారు. అన్నింటికన్నా ముఖ్యంగా 2019లో ఓడిపోయిన మంగళగిరిలోనే పట్టుబట్టి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. భారీ మెజారిటీ కూడా సాధించారు. ఇక, ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మంత్రి పదవి ఖాయమని కూడా అంటున్నారు.
2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో నారాలోకేష్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. కీలకమై న ఐటీ శాఖను కూడా అప్పగించారు. అప్పట్లో తెలంగాణ మంత్రి కేటీఆర్ కు పోటీగా ఇక్కడ నారా లోకేష్‌కు ఐటీ శాఖను అప్ప గించారనే చర్చ సాగింది.
ఐటీ మంత్రిగా ఆయన కొన్ని సంస్థలు తీసుకువచ్చారు. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా.. గ్రామాల్లోనూ నెట్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకువచ్చారు. వాస్తవానికి ఇది అప్పటి కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనికి ఏపీలోనూ అమలు చేయడంలో నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.
అలానే విశాఖకు ఐటీ కంపెనీలు రప్పించడంలోనూ.. మంగళగిరిలో ఐటీ అనుబంధం పరిశ్రమలు ఏర్పాటు చేయడంలోనూ నారా లోకేష్ మంత్రిగా కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన ఈ శాఖనే తీసుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ కల్పనలకు కీలకంగా ఐటీ ఉండడంతో దీనిని డెవలప్ చేస్తామని.. కొత్త సంస్థలు తీసుకువస్తామని.. ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత మంత్రి వర్గంలోనూ నారా లోకేష్ ఐటీ శాఖనే కేటాయిస్తారని ఎక్కువ మంది భావిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on June 6, 2024 7:05 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…