ఏపీలో అప్రతిహత విజయం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకం కానున్నారు.
ఎందు కంటే.. కేంద్రంలో తమకు ఈ సారి 400 సీట్లు పక్కా అని చెప్పుకొన్న బీజేపీకి ప్రజలు 250-270 మధ్య పరిమితం చేయనున్నా రు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్లు కూడా.. అలానే ఉన్నాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అసలు ప్రభావం చూపించదని బీజేపీ నేతలు అనుకున్నా.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, మణిపూర్ విధ్వంసం. మైనారిటీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేయడం వంటి కీలక అంశాలు పనిచేశాయి. దీంతో ఉత్తరాది ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లారు.
దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా.. బలంగా సీట్లురాబట్టింది. ఇప్పటి వరకు ట్రెండ్స్ ప్రకారం 235 స్థానాల వరకు ఇండియా కూటమి వచ్చేసింది. మొత్తానికి ఇరు పక్షాలకు కూడా మెజారిటీ లేదా.. మేజిక్ ఫిగర్ 272 చేరుకునే స్థాయిలో సీట్లు దక్కేలా కనిపించడం లేదు.
దీంతో ఇరు పక్షాలకు కూడా.. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. ఎన్డీయేలో ఇప్పటికే భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఈ అవకాశం కలిసి వస్తోంది. దీంతో చంద్రబాబు కేంద్రంలో కీ రోల్ పోషించే అవకాశం ఏర్పడింది. గతంలో చక్రం తిప్పినట్టుగానే ఇప్పుడు కూడా చంద్రబాబుకు చక్రం తిప్పే అవకాశం ఏర్పడింది.
ఇక, ఈ విషయం గ్రహించిన బీజేపీ పెద్దలు చంద్రబాబుకు వర్తమానాలు పంపుతున్నారు. ఎన్డీయే కన్వీనర్ పదవిని చేపట్టాలని చంద్రబాబుకు ఆఫర్ వచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే.. మరో 48 గంటల తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని.. అప్పటి వరకు వేచి చూడాలని చంద్రబాబు సూచించారు. ఇదిలావుంటే.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తున్న ట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన తమకు మద్దతు ఇవ్వాలన్నది ఆ పార్టీ నేతల మాటగా వినిపిస్తోంది. చంద్రబాబుతో టచ్‌లో ఉండే కీలక నేతల ద్వారా కాంగ్రెస్ రాయబారాలు నడుపుతున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎటు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on June 4, 2024 9:53 pm
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…