తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి భూమన లేఖ రాశారు. గత ఆగస్టులో భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఈ ఎన్నికల్లో తిరుపతి నుండి పోటీ చేసిన భూమన కుమారుడు అభినయ్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఆయన తిరుపతి నుంచి పోటీ చేశారు కానీ జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు చేతిలో ఓడిపోయారు. కుమారుడి విజయం కోసం భూమన కష్టపడ్డా ఫలితం లేకపోయింది. టీడీపీ కూటమి సునామీకి దాదాపు మంత్రులందరూ ఓటమి పాలయ్యారు. దీంతో అధికార వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావలసి వచ్చింది.
దివంగత నేత వైఎస్ హయాంలో 2004-2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్‌గా పని చేసిన భూమన 2006 నుంచి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వ్యవహరించాడు. 2019లో తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఈసారి తన కుమారుడిని బరిలో దింపాడు.
This post was last modified on June 4, 2024 9:41 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…