ఒడిశాలో సంచలనం చోటు చేసుకుంది. ఇక్కడ పాతిక సంవత్సరాలుగా రాజ్యమేలుతున్న ముఖ్యమంత్రి నవీన్ బాబు ఇంటి ముఖం పట్టారు. ఆయన పాలనకు ప్రజలు వ్యతిరేక ఓటు వేశారు. పలితంగా అసలు కలలో కూడా ఊహించని విధంగా ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 80 స్థానాల్లో విజయం దక్కించుకున్న ఆ పార్టీ మరో 5 నుంచి 6 స్థానాలు దక్కించుకునే అవకా శం ఉంది. ఇక, ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ పార్టీ(బీజేడీ).. ఇప్పుడు ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఐదేళ్ల కిందటే.. బీజేపీ ఇక్కడ గెలుపునకు సంకల్పం చెప్పుకొంది.
గత 2019 ఎన్నికల్లోనే బలమైన పోటీ ఇచ్చింది. దీనిని పాతికేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న నవీన్ పట్నాయక్ గ్రహించినా.. రాష్ట్ర అవసరాలు.. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో బీజేపీని నిలువరించలేక పోయారు. అంతేకాదు.. పనిగట్టుకుని పలు సందర్భా ల్లో ఆయన బీజేపీని, ప్రధానిని కూడా కొనియాడారు. ఈ పరిణామం.. అప్పట్లో బీజేపీవైపు చూస్తున్న ప్రజలను ప్రభావితం చేసిం ది. దీంతో బీజేపీ మరింత చెలరేగిపోయింది. సీఎం నవీన్ బాబు అభివృధ్ధి చేయడం లేదని.. తీవ్ర ప్రచారం చేపట్టింది. అంతేకా దు..ఎన్నికల వేళకు సీఎం నవీన్ అనారోగ్యాన్ని ప్రధాని మోడీ వంటి అగ్రనేతలు ప్రచారం చేశారు. నవీన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని.. పాలన చేయలే కపోతున్నారని ప్రచారంలో చెప్పుకొచ్చారు.
దీనికితోడు తమిళనాడుకు చెందిన ఐఏఎస్ అధికారి పాండియన్‌తో రిజైన్ చేయించి మరీ తన పార్టీ పగ్గాలు అప్పగించేప్రయత్నం చేశారు. దీంతో నవీన్ స్థానంలో పాండియన్ చక్రం తిప్పడాన్ని అక్కడి బీజేడీ నాయకులు సహించలేక పోయారు. దీంతో పార్టీలోనూ అంతర్గతంగా కొందరు బీజేపీకి సహకరించారు. ఇక, బీజేపీ విస్తృతంగా ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు.. పూరి జగన్నాధుడి ఆలయం కేంద్రంగా సాగించిన ప్రచారం వంటివి కూడా నవీన్‌కు సెగ పెట్టాయి.
ఫలితంగా 141 స్థానాలున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 80 మార్కును దాటేసి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక, బీజేడీ.. పాతికేళ్ల ప్రస్తానాన్ని ముగించి.. 50 సీట్లకే పరిమితం అయింది. కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పరుగులు పెడుతోంది. మొత్తానికి ఒకచరిత్ర సృష్టించిన బిజు కుటుంబ వారసుడు.. బ్యాచలర్ నవీన్‌బాబు మరో ఐదేళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on June 4, 2024 9:50 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…