చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రేమ ఎన్నోసార్లు బయట పడినా జనసేనకు బహిరంగంగా మద్దతు తెలుపడం లేదనే అసంతృప్తి కొందరు అభిమానుల్లో ఉండేది. ఇటీవలే ప్రచార సమయంలో పార్టీకి అయిదు కోట్ల విరాళం ఇవ్వడంతో పాటు పవన్ గెలుపుని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడం ద్వారా మెగాస్టార్ వాటికి పూర్తిగా చెక్ పెట్టారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంశయాన్ని పూర్తిగా తొలగించి గాజు గ్లాసుకి ఓటు వేయమని పిలుపు ఇచ్చి తన మనసులో మాటని చెప్పుకున్నారు. ఇప్పుడాయన కోరుకున్నదే జరిగింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జెండా పాతడమే కాదు జనసేనను అసెంబ్లీలో రెండో ప్రధాన పక్షంగా మార్చే స్థాయిలో తన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసిపిని మూడో స్థానానికి నెట్టేయడం పెను సంచలనం రేపుతోంది. ఒకప్పుడు టికెట్ రేట్ల పెంపు, పరిశ్రమకు ప్రోత్సాహకాల విషయంలో జగన్ ముందు చిరంజీవి నమస్కారం పెట్టి మరీ బ్రతిమాలిన వీడియో అప్పట్లో మెగా ఫ్యాన్స్ ని కదిలించింది. దీనికి బదులు మృదువుగా ఉండే అన్నయ్య చెప్పకపోయినా మొండోడు అయిన తమ్ముడు ఖచ్చితంగా చెబుతాడనే నమ్మకం అభిమానుల్లో పెరుగుతూ వచ్చింది.
ఈ గెలుపు తాలూకు భావోద్వేగం చిరంజీవి ట్వీట్ లో స్పష్టంగా కనిపిస్తున్న వైనం గురించి నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. గేమ్ ఛేంజర్, మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అంటూ అందరూ పొగుడుతూ ఉంటే గర్వంగా ఉందని చెబుతూ ఈ కొత్త అధ్యాయంలో శుభం కలగాలని పవన్ ని మనసారా ఆశీర్వదిస్తూ సుదీర్ఘమైన మెసేజ్ పెట్టడం వైరలవుతోంది. ప్రజా రాజ్యం పెట్టి పద్దెనిమిది సీట్ల గెలిచినా ఏ ప్రభావం చూపించలేకపోయిన నాయకుడిగా తాను కోరుకున్న విజయాన్ని పవన్ కళ్యాణ్ రూపంలో చూస్తున్న చిరు మనసులో ఎమోషన్ ని పదాల రూపంలో పసిగట్టడం కష్టమే. మాటల కందని భావోద్వేగమది.
This post was last modified on June 4, 2024 5:29 pm
స్విట్జర్లాండ్లోని దావోస్లో సోమవారం నుంచి ప్రారంభమైన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకోసం వెళ్లిన.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్,…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు టాప్ జాబ్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే…