జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టింది. పోటీ చేసిన 21 స్థానాలకు గాను 21 స్థానాలు గెలుచుకుని 100 కు వంద శాతం విజయాలు సాధించబోతున్నది. ఇప్పటికే రాజనగరం, నర్పాపురం స్థానాలలో ఫలితాలు వెల్లడి కాగా, మిగిలిన 19 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యాలతో ముందుకుసాగుతుంది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 64,492 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు.
ఏపీలో కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించాడు. బీజేపీ, టీడీపీలను కలపడంలో ఎంతో సంయమనంతో వ్యవహరించాడు. తనకు ఇచ్చిన స్థానాలను తగ్గించుకుని మరీ పోటీ చేశాడు. 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు పరిమితం అయ్యాడు. తనకు కేటాయించిన అన్ని శాసనసభ, లోక్ సభ స్థానాలలో పవన్ విజయం సాధించబోతున్నాడు.
పాలకొండలో 8736, నెల్లిమర్లలో 19,246, విశాఖ సౌత్ లో 61,563, అనకాపల్లిలో 25,156, పెందుర్తిలో 47,646, యలమంచిలిలో 24,193, కాకినాడ రూరల్ లో 38,199, రాజోలులో 36,099, గన్నవరంలో 22,558, నిడదవోలులో 26,729, భీమవరంలో 66,974, తాడేపల్లిగూడెంలో 61,510, ఉంగుటూరులో 40,337, పోలవరంలో 3213, ఆవనిగడ్డలో 28,560, తెనాలిలో 46,484, కోడూరులో 11,439, తిరుపతిలో 17,119 ఓట్ల ఆధిక్యంలో జనసేన అభ్యర్థులు ఉన్నారు.
This post was last modified on June 4, 2024 3:36 pm
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…