ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ధాటికి అధికార వైసీపీ కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు ఓటమి దిశగా సాగుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీని ఇస్తుంది. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ మెజారిటీ తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు, జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్ చేసేలా కనిపిస్తోంది.
మంత్రులలో ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పల రాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడుదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఉష శ్రీ చరణ్ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల, తూర్పు గోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10లో 6 చోట్ల, కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల , ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10, శ్రీకాకుళంలో 10కి 9, విశాఖ పట్నంలో 15కి 13, విజయ నగరంలో 9కి 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 175 శాసనసభ స్తానాలలో టీడీపీ 130, జనసేన 20, వైసీపీ 18, బీజేపీ 7 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 25 లోక్ సభ స్థానాలలో 21 స్థానాలలో కూటమి అభ్యర్థులు, 4 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
This post was last modified on June 4, 2024 2:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…