ఏపీకి పొరుగున ఉన్న ఒడిశా ప్రజలు వినూత్న తీర్పు ఇచ్చారు. గత 25 సంవత్సరాలుగా. ఇక్కడ విజయ విహారం చేసిన బిజు జనతాదళ్ పార్టీని ఇక్కడి ప్రజలు ఓటమి దిశగా నడిపిస్తున్నారు. మొత్తం స్థానాల్లో బీజేపీ 77 చోట్ల లీడ్‌లో ఉంది. అది కూడా వేల సంఖ్యలో ఓట్లలో దూసుకుపోతోంది. ఇక, అధికార పార్టీ బీజేడీ మాత్రం కేవలం 51 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది. అది కూడా స్వల్పంగా ఉండడం తో ఇక్కడ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆది నుంచి అంటే.. గడిచిన 25 సంవత్సరాలుగా సీఎం నవీన్ పట్నాయక్ పార్టీకి ఇక్కడి ప్రజలు జై కొట్టారు. దీంతో ఆయన పాతిక సంవత్సరాలుగా.. నవీన్ అధికారంలో ఉన్నారు. ఆయనే సీఎంగా వ్యవహరించారు.అయితే.. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. మరోవైపు.. దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ అందిపుచ్చుకుంది. ఎన్నికల వేళ.. ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ అనారోగ్యాన్ని ప్రచారం చేసుకుంది.
మాజీ ఐఏఎస్ పాండ్యన్ కు దాదాపు అధికారాన్ని అప్పగించి.. చివరి రెండు సంవత్సరాలు కూడా.. నవీన్ యాక్టింగ్ సీఎంగానే వ్యవహరించారు.. దీంతో ఈ వ్యవహారం బీజేపీకి కలిసి వచ్చింది. దీంతో ఇదే విషయాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చింది. దీనికి తోడు పాతికేళ్లుగా నవీన్ సీఎంగా ఉన్నప్పటికీ తమ జీవితాల్లో మార్పులేకుండా పోయిందన్న ప్రజానాడిని పట్టుకోవడంలోనూ బీజేపీ సక్సెస్ అయింది.
దీనికితోడు పూరి జగన్నాథుడి ఆలయ తాళాల వ్యవహారం కూడా.. నవీన్‌కు ఇబ్బందిగా మారింది. మొత్తంగా చూస్తే.. పాతికేళ్ల ప్రస్తానం ఇక్కడ బీజేడీకి ముగిసిపోయి.. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడింది.
This post was last modified on June 4, 2024 12:36 pm
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…