ఏపీలో వచ్చిన ఫలితాన్ని గమనిస్తే…. ఏడో దశ పోలింగ్ అనంతరం.. జాతీయ మీడియా వెల్లడించిన ఎగ్జి ట్ పోల్స్ దాదాపు సక్సెస్ అయ్యాయనే మాట వినిపిస్తోంది. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాల్లో కూటమి 18-20 స్థానాల వరకు దక్కించుకుంటాయని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అంతేకాదు.. వైసీపీ కేవలం.. 2-4 స్థానాల్లో మాత్రమే పుంజుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఇదే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.
రాష్ట్ర స్థాయిలో చేసిన సర్వేల్లో.. పార్లమెంటుస్థానాల విషయంలో కూటమికి 14-16 వస్తాయని చెప్పినా.. జాతీయ మీడియా సర్వేల్లో మాత్రం 20-22 వరకు వస్తాయని చెప్పాయి. అంతేకాదు.. మరికొన్ని 18-20 వరకు వస్తాయని తెలిపాయి. అయితే.. వీటిపై వైసీపీ అనుకూల వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. పైగా.. బీజేపీ ఆరు చోట్ల పోటీ చేయగా.. 4 చోట్లలీడ్‌లో ఉంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ విషయంలో జాతీయ మీడియా చెప్పింది అక్షర సత్యంగా మారిందనే వాదన వినిపిస్తోంది.
మరీ ముఖ్యంగా ఆరా మస్తాన్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ సర్వేపై రోజుల తరబడి చర్చ సాగింది. అంతేకాదు.. పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా రేగింది. దీంతో ఆయన సర్వే విషయాన్ని ఇప్పుడు పరిశీలిస్తే.. అది ఇప్పుడు దాదాపు ఫెయిల్ అయిపోయింది. అంతేకాదు.. ఆది నుంచి అందరూ అనుకున్న టఫ్ ఫైట్ కూడా ఎక్కడా కనిపించలేదు. నరాలు తెగే ఉత్కంఠ కూడా.. లేదు. అంతా ఏకపక్షంగానే ఓటింగ్ జరిగిపోయింది. దీంతో వైసీపీ శిబిరంలో కళ పోయింది.
This post was last modified on June 4, 2024 11:42 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…