Political News

అరెస్టుల కెక్కిన రేవ్ పార్టీ !

బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏకంగా నటి హేమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం విచారణకు హాజరయిన నటి హేమ రేవ్ పార్టీ ఆర్గనైజింగ్ కీలకపాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. మొత్తం ఐదుగురితో కలిసి ఈ పార్టీ రేవ్ పార్టీని ప్లాన్ చేసిందని విచారణలో తేలింది. దీంతో నటి హేమను అరెస్ట్ చేశారు బెంగుళూరు పోలీసులు.

రేవ్ పార్టీని నిర్వహించడంతోపాటు.. డ్రగ్స్ పాజిటివ్ రావడంతో నటి హేమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం బెంగళూరు మెజిస్ట్రేట్ ముందు హేమను హాజరుపరచనున్నారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే రెండుసార్లు నటి హేమకు బెంగుళూరు పోలీసులు నోటీసులు పంపించారు. కానీ ప్రతిసారి వివిధ కారణాలు చెబుతూ విచారణకు వెళ్లలేదు. హేమ తీరుపై విసుగు చెందిన పోలీసులు ఈరోజు హైదరాబాద్ చేరుకుని మరోసారి నోటీసులు పంపించగా ఎట్టకేలకు పోలీసుల ముందుకు  బురఖాలో వెళ్లింది.

అయితే విచారణలో పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని, అలాగే పార్టీ ప్లాన్ చేయడం, నిర్వహించడంలో హేమ కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. దీంతో నటి హేమను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనరల్ హాస్పిటల్లో హేమాకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం.. ఈరోజు రాత్రికి స్టేట్ హోమ్ కు తరలించనున్నారు. రేపు మెజిస్ట్రేట్ ముందు హేమాను హాజరు పరచనున్నారు.

This post was last modified on June 4, 2024 6:58 am

Share

Recent Posts

వైసీపీ ఎంపీ ‘అతి’కి సుప్రీం బ్రేక్

వైసీపీ తిరుప‌తి ఎంపీ గురుమూర్తిపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. "ఎంపీగారు అతిగా స్పందిస్తున్నారు. ఇలా అయితే.. భారీ జ‌రిమానాను…

53 seconds ago

రావిపూడి+ సంక్రాంతి లేకపోతే.. వెంకీ ఇంతేనా?

టాలీవుడ్లో ఇమేజ్, ఫ్యాన్స్ అని లెక్కలు వేసుకోకుండా.. కలెక్షన్లు, రికార్డుల గురించి అస్సలు పట్టించుకోకుండా సినిమాలు చేసే హీరో విక్టరీ…

4 minutes ago

వేగం కన్నా ముఖ్యంగా వివేకం కావాలి

స్వీయ దర్శకత్వంలో, ఎవరూ టచ్ చేయని జానర్ అంటూ పూర్తిగా వయొలెంట్ రూటు పట్టిన విశ్వక్ సేన్ కు 'కల్ట్'…

16 minutes ago

జగన్ స్పీచ్ లే ట్రోలర్స్ కు శ్రీరామ రక్ష

ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా సరే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి అధ్యక్షుడు…

26 minutes ago

“మీరు ఢిల్లీకి ఎందుకు రాలేదు?”.. రేవంత్ సీరియస్

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ‌స్థాయిలో 'ఓట్…

1 hour ago

పెద్దిరెడ్డి పరువు పోయిందిగా!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి భారీ షాక్…

2 hours ago