ఏపీ అధికారపార్టీ వైసీపీకి కీలకమైన ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు కొన్ని గంటల ముందు.. సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉద్యోగులు, ఇంటి నుంచి ఓట్లేసిన వృద్ధులు, దివ్యాంగుల ఓట్ల విషయంలో వైసీపీ ఆందోళనగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర హైకోర్టులో వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనిని సుప్రీంకోర్టులోనూ వైసీపీ సవాల్ చేసింది.
వివాదం.. ఏంటంటే.. రాష్ట్రంలోని ఉద్యోగులు 3.9 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకు న్నా రు. అయితే.. వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిబంధనల ను పాటించాలని తేల్చి చెప్పింది. అయితే.. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో కొంత వెసు లుబాటు కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగిని నిర్ధారిస్తూ.. సంబంధిత అధికారి ఫాం 13(ఏ) ఇస్తారు. దీని తర్వాతే .. ఉద్యోగి తన ఓటు ను వేసే అవకాశం ఉంది.
అయితే.. ఫాం 13(ఏ)లో సంతకం చేసి.. సీటు వేయాల్సి ఉంటుంది. కానీ.. తాజాగా ఎన్నికల సంఘం సం తకం చేస్తే చాటు.. సీలు వేయకపోయినా.. ఇతర వివరాలు రాకపోయినా.. ఫర్వాలేదని తేల్చి చెప్పింది. ఇది వివాదానికి దారితీసింది. సీలు, వివరాలు లేని ఫామ్ 13(ఏ) ఆధారంగా వేసే ఓటును చెల్లనివిగా పరిగణించాలని కోరింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేయాలని కూడా అభ్యర్థించింది. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు పిటిషన్‌ను కొట్టేసింది.
ఇక, ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం నిబంధనలు, ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ సమయంలో జోక్యం చేసు కుంటే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది.
This post was last modified on June 3, 2024 5:09 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…