ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ లేదు.. బగ్జిట్ లేదు పోవాయ్! అని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అనంతరం.. ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్‌ను ఆయన లైట్ తీసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను కొందరు మేనేజ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఉన్న విశ్వసనీయత ఇప్పుడు లేదన్నారు.
“ఇదంతా ఓతతంగం. గోల్ మాల్ గోవిందం. ఎగ్జిట్ పోల్స్ ట్రాష్. ఒకరు 11 బీఆర్ ఎస్ కొట్టేస్తుందని అన్నారు. మరొకరు జీరో అన్నారు. మరి జీరో అన్నాయనకు ఎవరు చెప్పిరో ఏమో. ఈ 11 అన్నాయన ఎక్కడ ఎవరిని అడిగిండో. ఇదంతా ట్రాష్.. కోట్లకు బెట్టింగులు కట్టేవారి కోసం.. ఉపయోగపడతాయేమో..” అని కేసీఆర్ కొట్టిపారేశారు. అసలు ఫలితం మరొక్క రోజులో వస్తుందని, అప్పటి వరకు ఎందుకంత తొందర అని అన్నారు.
“నేను స్వయంగా చూసిన. ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర చేసిన. ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. మాకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఎగ్జిట్, బగ్జిట్‌తో మాకు సంబంధం లేదు. ప్రజలు ఇచ్చే తీర్పే ప్రామాణికం. మాకు ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం. ఎన్ని వచ్చినా బాధ లేదు” అని కేసీఆర్ అన్నారు.
ఉన్నది 17 సీట్లేనని.. బీఆర్ ఎస్‌కు 11 వచ్చినా మేం పొంగిపోబోమని.. అలాగని 2 , 3 వచ్చినా బాధపడేది లేదని చెప్పారు. తెలంగాణను కాపాడుకునేది బీఆర్ ఎస్ పార్టీయేనని చెప్పారు. పార్లమెంటులో బలమైన గళం వినిపించేది బీఆర్ ఎస్‌మాత్రమేనని తెలిపారు. ఎవరెవరో వస్తారు… ఏదేదో చెబుతారు.. నమ్మేటోళ్లు నమ్ముతారు. అని కేసీఆర్‌తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
This post was last modified on June 3, 2024 12:18 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…