“కౌంటింగ్ రోజు ఏమైనా జరగొచ్చు.. అందరూ అప్రమత్తంగా ఉండాలి“-ఇది ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తన కూటమి పార్టీల అధినేత ల నుంచి నాయకుల వరకు చెబుతున్న మాట.
అయితే.. ఇదే మాటను కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలోనూ వినిపించింది. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా.. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ వినిపిం చింది.
ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అయితే..ముఖ్యమంత్రులే ఈ ప్రకటన చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుంది? కౌంటింగ్ రోజు ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? గెలిచే వారిని ఓడించడం సాధ్యమేనా? అనే చర్చ సాగుతోంది.
నిజానికి ఒకప్పుడు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేసిన సమయంలో తప్పుల తడకలను కూడా.. కౌంట్ చేసేవారనే విమర్శలు వచ్చే వి. దీంతోపాటు.. బ్యాలెట్ బాక్సుల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా వచ్చేవి. కానీ..ఈ వీఎంలు వచ్చిన తర్వాత.. కౌంటింగ్ త్వరగా పూర్తి కావడం.. ఇలాంటి విమర్శలకు వివాదాలకు అవకాశం లేకుండా పోవడం గమనార్హం.
అయితే.. ఇప్పుడు అనూహ్యంగా ఈవీఎంల ఓట్ల లెక్కింపు రోజు కూడా.. అప్రమత్తంగా ఉండాలంటూ.. ప్రతిపక్షాలు.. ముఖ్యంగా బీజేపీయే తర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాలు చూస్తే.. నిజమేనా అనే సందేహం వస్తుంది.
కౌంటింగ్ జరిగే రోజు కూడా.. ఓట్లు వేసుకునే అవకాశం ఉందని మమత చెబుతున్నారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. ఆప్షన్ ను వెంటనే తీసేస్తారు. కేవలం లెక్కింపు ఆప్షన్ మాత్రమే ఉంచుతారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసి ఓట్లు లెక్కిస్తారని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది సాధ్యమేనా? అన్నదానిపై నిపుణులు తలోమాట చెబుతున్నారు.
సాధ్యమేనని.. ట్యాంపరింగ్ చేయొచ్చని ఐఐటీ నిపుణులు చెబుతున్నారు. ఎన్ ఐటీనిపుణులు మాత్రం కాదని అంటున్నారు. దీంతో ఈ రెండు వాదనల్లో ఏది నిజమో తెలియడం లేదు.
ఇక, కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా.. తాజాగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాల ని ఇండియా కూటమి పార్టీలకు సూచించింది. తన పార్టీ నాయకులకు కూడా తేల్చి చెప్పింది. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయి నా.. బీజేపీ ఏమైనా చేయొచ్చన్నది ఈ పార్టీ చెబుతున్న మాట. కానీ, ఏం చేస్తుందో మాత్రం చెప్పడం లేదు.
ఇక, ఏపీలోనూ చంద్రబాబు వైసీపీ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని చంద్రబాబు కూడా.. తన పార్టీ నాయకులకు చెబుతున్నారు. అదేసమయంలో రగడను సృష్టించి కౌంటింగ్ నిలిచిపోయేలా చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే.. ఇంత ఆందోళన వ్యక్తమవుతున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెబుతుండడం గమనార్హం. మరి కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2024 10:49 am
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…