ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగి.. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీరి.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి న రోజు.. జూన్ 2. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహా.. అక్కడి రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక, ఏపీలో మాత్రం అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఏ కార్యక్రమం కూడా లేదు. గతంలో చంద్రబాబు హయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించేవారు. జగన్ సర్కారు ఇలాంటి కార్యక్రమాలు మానేసింది.
కాగా.. ఈ అవతరణ వేడుకలను పురస్కరించుకుని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రెసిడెంట్.. నారా చంద్ర బాబు రియాక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరుకుంటు న్నట్టు తెలిపారు.
ఇరు రాష్ట్రాల్లోని 10 కోట్ల మంది తెలుగు ప్రజలు అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి జరిగాయన్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల ద్వారా సంపద సృష్టి జరిగిందని చంద్రబాబు తెలిపారు.
ఇక, అక్కడి నుంచి ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చాయన్నారు. ఆర్థిక విజ్ఞానంతో అవకాశాలు మరింత పెరిగాయన్నారు. వీటిని అందిపుచ్చుకున్న తెలుగు వారు… ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబా బు తెలిపారు.
పేదరికం లేని సమాజం దిశగా రెండు రాష్ట్రాల ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజల విజయాలు, కీర్తి విశ్వం మొత్తం తెలియాలని, తెలిసేలా ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి.. ఈదేశం, మన రెండు రాష్ట్రాలు కూడా.. పురోగమించాలని కోరుకుంటున్నట్టు బాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on June 2, 2024 6:55 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…