Political News

కండువా కప్పుకోరు.. కానీ పార్టీ మారనున్న తెలుగు తమ్ముడు

అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల మాదిరి వాలే నేతల్ని చేరదీసి..పదువులు ఇచ్చే చంద్రబాబుకు.. తర్వాతి కాలంలో అలాంటి వారిస్తున్న షాకులు అన్ని ఇన్ని కావు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీడీపీ హయాంలో పదవులు పొందక తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలుగు తమ్ముళ్లు.. ఒక్కొక్కరిగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం చూస్తున్నదే. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బ తీయటానికి అధికార పార్టీ ఆకర్ష్ మంత్రాన్ని పఠిస్తుంటుంది.

అందుకు భిన్నంగా సీఎం జగన్ నుంచి ఎలాంటి ఆహ్వానం లేకున్నా.. ఒక్కొక్కరుగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వదిలేసి.. ఏపీ అధికార పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తునన వైనం తెలిసిందే. ఇప్పటికే ఈ తీరులో పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో టీడీపీ ఎమ్మెల్యే పేరు చేరనుంది. విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన వాసుపల్లి గణేశ్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

ఈ రోజు (శుక్రవారం) సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన కలవనున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు అధికార పార్టీకి మద్దతుగా నిలవటం తెలిసిందే. మెడలో పార్టీలో కండువా వేసుకోరు కానీ.. మద్దతు ఇచ్చే సంప్రదాయాన్ని వాసుపల్లి కూడా ఫాలో కానున్నట్లు చెబుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. తాను అధికారపార్టీలో చేరాలని డిసైడ్ అయిన సంకేతాల్ని ఇచ్చారు. తాజాగా సీఎంను కలిసి.. తాను పార్టీకి మద్దతుదారుగా ఉండనున్నట్లు చెప్పనున్నారు.

సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా.. పార్టీ కండువాను ఆయన కప్పుకోరు. ఇప్పటికే ఇదే తీరును టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ.. కరణం బలరాం .. మద్దాలి గిరిలు ప్రదర్శించారు. తాజాగా వాసుపల్లి కూడా ఇదే రూట్ ను ఎంచుకున్నట్లుగా చెబుతున్నారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న తీరు చూస్తే.. ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఎంతమంది మిగులుతారన్నది పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.

This post was last modified on September 19, 2020 7:16 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

28 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago