ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంకో మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. శనివారమే దేశవ్యాప్తంగా చివరి దశ లోక్‌సభ ఎన్నికలు పూర్తి అవుతుండడంతో శనివారం సాయంత్రం ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటికి రాబోతున్నాయి. వీటితోనే ఫలితాల మీద ఒక అంచనా వచ్చేస్తుందని భావిస్తున్నారు.
కాగా ఏపీలో ఎన్నికలు అయిన దగ్గర్నుంచి పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తోంది. మునుపెన్నడూ లేని స్థాయిలో వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఎన్నికలు అయిన దగ్గర్నుంచి ఎక్కువగా బెట్టింగ్ రాయుళ్లు పందెం కాస్తున్నది కూటమి వైపు. క్రమ క్రమంగా వైసీపీ వైపు పందెం కాసే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం ఆ పార్టీ మీద పందెం కాయడానికి భయపడే పరసి్థితి వచ్చింది.
ఒక దశలో వైసీపీ గెలిచినట్లు పందెం కాస్తే రూపాయికి రూపాయిన్నర, రెండు రూపాయలు ఇచ్చేలా పందేలు నడిచాయి. కాగా లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే.. వైసీపీ మీద పందెం కాస్తే రూపాయికి మూడు రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారట. అంత టెంప్టింగ్ ఆఫర్లు ఇస్తున్నా ఆ పార్టీ వైపు పందేలు కాసేవాళ్లు కనిపించడం లేదని టాక్. వైసీపీ వాళ్లే ఆ పార్టీ మీద పందెం కాయడానికి వెనుకంజ వేస్తున్నారు.
కొందరు పేరున్న రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని తమ విశ్లేషణల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్‌లో కనుక కూటమికి అనుకూలంగా ఫలితాలు ప్రకటిస్తే.. ఇక వైసీపీ విజయావకాశాలను పూర్తిగా కొట్టి పారేయొచ్చని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరా మస్తాన్ లాంటి వాళ్లు ప్రకటించే ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on June 1, 2024 6:14 pm
నిన్నా మొన్న పరాశక్తి మీద తమిళ తెలుగు మీడియాలో చిన్నపాటి దుమారమే రేగింది. శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీ బృందాలు…
తమిళనాడు రాజకీయాలను తన కనుసన్నల్లో శాసించిన దివంగత జయలలిత ఆస్తుల వ్యవహారం మరోమారు తెర మీదకు వచ్చి ఆసక్తి రేకెత్తిస్తోంది.…
వివాహ ఆహ్వాన పత్రిక అంటే…సామాన్యులకైనా, ధనికులకైనా చాలా ప్రత్యేకం. గతంలో అయితే ఏమో గానీ… సంపద పెరిగిన ప్రస్తుత కాలంలో…
బుట్టబొమ్మ పూజా హెగ్డే తెరమీద కనిపించి రెండేళ్లకు దగ్గరవుతోంది. బాలీవుడ్ కిసీకా భాయ్ కిసీకా జాన్ డిజాస్టర్ తర్వాత మళ్ళీ…
ఇంకో ఆరు రోజుల్లో పట్టుదల విడుదల కానుంది. అజిత్ హీరోగా మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్…
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఒకరు. పైకి సౌమ్యుడిలా కనిపిస్తారు కానీ..…