ఆంధ్రప్రదేశ్ తర్వాతి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమనే అంచనాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి బాబు రెడీ అవుతున్నారని తెలిసింది.
అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి పార్టీలోని సీనియర్ నేతలకు బాబు బాధ్యతలు అప్పగించారని సమాచారం. అలాగే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదట ఏం చేయాలి? స్పీచ్ ఎలా ఉండాలి? అనే కసరత్తులు కూడా చేస్తున్నట్లు తెలిసింది.
అమెరికా నుంచి వచ్చిన బాబు ఈ సారి అధికారంలోకి కూటమి రావడం ఖాయమని సన్నిహితులతో చెప్పినట్లు టాక్. మరోవైపు తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎవరెవరిని పిలవాలనే జాబితాను కూడా బాబు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
కుదిరితే ప్రధాని నరేంద్ర మోడీని లేదంటే అమిత్ షాను ముఖ్య అతిథిగా ఆహ్వానించే అవకాశముంది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌నూ పిలిచే ఆస్కారముంది. ఇలా ముఖ్య అతిథుల జాబితాను సిద్ధం చేసే బాధ్యతను పార్టీలోని ఓ సీనియర్ నాయకుడికి బాబు అప్పగించినట్లు సమాచారం.
మరోవైపు ప్రమాణ స్వీకారం తేది, వేదికను కూడా బాబు ఖరారు చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ 9న అమరావతిలో ఈ కార్యక్రమం ఉండబోతుందని తెలిసింది. ఇందుకు మూహూర్తం నిర్ణయించేలా పండితులతో మాట్లాడే బాధ్యతను మరో సీనియర్ నాయకుడికి కట్టబెట్టినట్లు తెలిసింది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల పనిని మరో సీనియర్ నేతకు అప్పజెప్పినట్లు టాక్.
This post was last modified on June 1, 2024 1:12 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…