ఎన్నికలు వచ్చినా.. పార్టీ ఉనికి ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చినా.. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేయడమే ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ సాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన బీఆర్ఎస్.. రాష్ట్రం ఏర్పడ్డాక వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.
ఆ రెండు ఎన్నికల్లోనూ అభివృద్ధిని చెప్పుకోకుండా ఎంత సేపు ఆంధ్రవాళ్లు, తెలంగాణ సెంటిమెంట్‌ను నమ్ముకుని కేసీఆర్ గట్టెక్కారనే విమర్శలున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసేందుకు ప్రయత్నించినా కేసీఆర్ పప్పులుడకలేదు. ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు.
ఆ ఎన్నికల్లో ఓటమితో ఒక్కసారిగా తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి తలకిందులైంది. బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు ఒకట్రెండు సీట్లు కూడా దక్కే పరిస్థితి కనిపించలేదు.
దీంతో పార్టీని కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్ మరోసారి ఆంధ్ర పేరుతో పబ్బం గడుపుకునేందుకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రూపొందించే బాధ్యతలను ఏపీకి చెందిన కీరవాణికి అప్పజెప్పడంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మండిపడుతోంది.
ఇక రాష్ట్ర చిహ్నంలో మార్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మరింతగా విమర్శలకు పదును పెడుతోంది. చిహ్నంలో నుంచి చార్మినార్‌ను, కాకతీయ కళాతోరణాన్ని ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నిస్తోంది. దీనిపై ఆందోళనలకు సైతం దిగుతోంది. చార్మినార్ దగ్గర ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
అయితే గతంలో కేసీఆర్ హయంలో ఇతర రాష్ట్రాల వారికి కీలక బాధ్యతలు అప్పజెప్పడాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. బతుకమ్మ పాటలను తమిళనాడుకు చెందిన ఏఆర్ రెహమాన్‌తో కవిత ఎలా పాడించారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టును దక్కించుకున్న మేఘా కృష్ణారెడ్డి, యాదాద్రి డిజైన్‌ను రూపొందించిన ఆనంద్ సాయి ఆంధ్రవాళ్లే కదా అని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. ఇప్పటికైనా ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నాలను మానాలని కేసీఆర్‌కు హితవు పలుకుతోంది.
This post was last modified on June 1, 2024 12:58 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…