తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడులను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ జాతీయ గీతం వంటివాటిని ఆవిష్కరించనున్నారు. ఆదివారం జరగనున్న ఈ కార్యక్రమం … నభూతో అన్నట్టుగా నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు చేసింది. దీనికి ఎంతో మంది ఉద్యమకారులను కూడా ఆహ్వానించింది. మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా పిలిచారు.
ఇక, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు.. సోనియా గాంధీ ని కూడా ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది. ముందు వస్తారని భావించినా.. చివరి నిముషంలో సోనియా గాంధీ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాలతో తాను రాలేక పోతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ కీలక నాయకుల కు సోనియా ఫోన్ చేసి మరీ చెప్పినట్టు సమాచారం. తన ఆరోగ్యం బాగోలేదని.. రావాలని ప్రయత్నించా నని ఆమె తెలిపారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఇక, ఈ కార్యక్రమానికి రావాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి భట్టి విక్రమార్కలు.. గవర్నర్ రాధాకృష్ణను కలిశారు. ఆయనకు పుష్పగుఛ్ఛం అందించి..ఆహ్వాన పత్రికను ఇచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. మరి ఆయన అయినా.. వస్తారో లేదో చూడాలి. ఇక, మాజీ సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆయన సొంతగానే కార్యక్రమాలు చేసుకుంటున్న నేపథ్యంలో సర్కారు కార్యక్రమానికి రారని భావిస్తున్నారు.
This post was last modified on June 1, 2024 12:53 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…