ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు.. ప్రతిపక్షంలో కూర్చుంటారు? అనేది తేలేందుకు.. మరో ఐదు రోజుల వరకు వేచి చూడక తప్పదు. జూన్ 4న కానీ.. సార్వత్రిక ఎన్నికల ఫలితం వచ్చే అవకాశం లేదు.. అప్పటి వరకు ఎవరికీ నిద్ర పట్టడం లేదు. అయితే…. ఈ మధ్య కాలంలో ఎవరి అంచనాలు వారి వి. ఎవరి లెక్కలు వారికిసొంతం. మేమే గెలుస్తున్నామని.. వైసీపీ చెబుతోంది. కానీ, దుష్ట పాలనకు చరమ గీతం పాడి.. తమకే ప్రజలు పట్టం కట్టారని.. టీడీపీ ద్వితీయ స్థాయి నాయకులు చెబుతున్నారు.
మొత్తంగా రాష్ట్రంలో అయితే.. ఒక గుంభమైన పరిస్థితి నెలకొంది. ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠగానే ఉంది. అయితే.. ప్రాంతాల వారీగా చూసుకుంటే.. ఎవరికైనా 33 సీట్లు చాలా సంక్లిష్టంగా మారాయి. ఆయా స్థానాల్లో విజయం దక్కించుకున్నవారే అధికారం చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మొత్తం 33 స్థానాల్లో అత్యంత టఫ్ ఫైట్ జరుగుతోంది. మరో 62 స్థానాల్లో కూడా.. తీవ్రంగా పోటీ ఉంది. ఇక, వైసీపీ ఏకపక్షంగా గెలుచుకునే సీట్లు సీమలో ఉన్నాయి.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఉమ్మడిగా దున్నేసే సీట్లు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉమ్మ డి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నాయి. ప్రకాశంలో ఈ సారి కూటమి క్లీన్ స్వీప్ చేసే అవకాశం కనిపిస్తోం ది. దీంతో ఆ 33 స్థానాల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వారే అధికారం చేపట్టే అవకాశం ఉంది. వీటిలో ఉత్తరాంధ్రనుంచి సీమ వరకు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి వర్సెస్ వైసీపీ తీవ్రస్థాయిలో పోరాడుతున్నాయి. బలమైన నాయకులను కూడా పెట్టాయి. దీంతోనే ఈ ఎన్నికలు ఇంత టఫ్‌గా మారాయి.
ఇక, అనేక సర్వేలు.. అనేక మంది విశ్లేషకులకు కూడా అంతు చిక్కని విషయం కూడా ఇదే కావడం గమ నార్హం. ఆ 33 నుంచి 40 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేక పోతున్నారు. సర్వే సంస్థలు కూడా. ఆ నియోజకవర్గాలే గెలుపు గుర్రాన్ని డిసైడ్ చేస్తాయని చెబుతున్నాయి. కానీ, ఎవరు గెలుస్తారనే పక్కా అంచనాలు మాత్రం రావడం లేదు. ఆ నియోజకవర్గాల్లో గెలిచే వారికే ఏపీ పీఠం దక్కుతుందని అంటున్నారు. చిత్రం ఏంటంటే.. వాటిలోనే ఎక్కువ మంది మహిళలు ఓటేశారు. ఇది మరీ చిత్రంగా మారింది.
This post was last modified on May 31, 2024 5:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…