ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంత్రుల పేషీ నుంచి చిత్తు కాగితం కూడా తీసుకువెళ్లేం దుకు వీల్లేదని.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల పేషీ ల నుంచి పత్రాలు, ఫైళ్లు, ఇతరత్రా డిజిటల్ డివైజ్‌లను కూడా తీసుకు వెళ్లరాదని ఆదేశించింది. ఈ బాధ్యతలను కార్యాలయ సిబ్బందికి అప్పగించింది.
ఇదేసమయంలో మంత్రుల పేషీకి ఎవరు వచ్చినా.. ఎవరు వెళ్లినా.. వారిని, వారు ప్రయాణించిన వాహనా న్ని కూడా.. క్షుణ్ణంగా పరిశీలించాలని.. అవసరమైతే… పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా.. ఆదేశించ డం గమనార్హం.
ఎన్నికల సంఘం ఆదేశాలను అందరూ పాటించాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వు ల్లో స్పష్టం చేసింది. మరో నాలుగురోజుల్లో మంత్రుల పేషీలను తాము స్వాధీనం చేసుకుంటామని పేర్కొం ది. ఎన్నికల పోలింగ్ ఫలితం రావడానికి ముందు రోజు మంత్రుల పేషీలను ప్రభుత్వ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటాని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు మంత్రుల పేషీలు, ప్రభుత్వ కీలక కార్యాలయా లను కూడా పరిరక్షించాలని, నిఘా ను ముమ్మరం చేయాలని.. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని కూడా.. ఆదేశాల్లో పేర్కొంది.
సచివాలయం నుంచి తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది. జూన్ 3లోగా మంత్రుల పేషీలకు తాళాలు వేయాలని తెలిపింది. మంత్రులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు(ఫోన్ చార్జర్లు, టవళ్లు, పెన్నులువంటివి) తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందని తెలిపింది.
This post was last modified on May 31, 2024 5:02 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…