పోర్న్ వీడియోల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. దాదాపు 3 వేల మంది ఉద్యోగినులు, ఉన్నతాధికారులు, ఇంట్లో పని చేసుకునే మహిళలపై ప్రజ్వల్ సెక్స్ చేశారని.. వాటిని వీడియోలు తీశారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయంలో వెలుగు చూడడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది.
ఒక రకంగా కర్ణాటక రాజకీయాలను ఈ ఘటన కుదిపేసింది. ఎందుకంటే.. మాజీ ప్రధాని దేవెగౌడకు రాష్ట్రంలో మంచి పేరుంది. అందరూ ఆయనను బాపూ అని సంబోధిస్తారు. అలాంటి ఉత్తమ కుటుంబం లో ఎప్పుడూ.. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారు లేకపోవడంతో ఈ వివాదం మరింత సంచలనంగా మారింది. అయితే.. చిత్రంగా ఈ కేసు వెలుగు చూసిన మర్నాడే ప్రజ్వల్.. జర్మనీకి పారిపోయారు. అక్కడి నుంచి మరోదేశానికి కూడా వెళ్లిపోతున్నారని వార్తలు వెలుగు చూశాయి.
అయితే.. ఎట్టకేలకు 34 రోజుల తర్వాత.. ప్రజ్వల్ తిరిగి కర్ణాటకకు రావడం గమనార్హం. ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చీ రావడంతోనే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను అరెస్టు చేసింది. రేవణ్ణను కోర్టులో హాజరు పరచనున్నారు. యథాతథంగా 14 రోజుల కస్టడీ.. ఆ వెంటనే బెయిల్ పిటిషన్.. దీనిపై రెండు రోజులు తర్జన భర్జన .. తర్వాత ఏదో ఒక కారణం చూపించి.. ఆయనను బెయిల్ పై విడుదల చేయడం ఖాయమే!!
అయితే.. అసలు 34 రోజుల పాటు ప్రజ్వల్‌ను తప్పించడం, తిరిగి ఆయనను తీసుకురావడం వెనుక ఏం జరిగిందనేది కీలకం. ఎందుకంటే.. నిజానికి పారిపోవాలని అనుకున్న వ్యక్తి.. ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి వచ్చే అవకాశం లేదు. కానీ, ఇక్కడే కీలక పరిణామం ఉంది. ప్రజ్వల్ పారిపోవడం.. 34 రోజుల తర్వాత తిరిగి రావడం మధ్యలోనే అసలైన రాజకీయం ఉందని అంటున్నారు పరిశీలకులు. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రజ్వల్ కర్ణాటకలో ఉంటే.. ప్రమాదమని.. బీజేపీ కేంద్ర పెద్దల నుంచి సమాచారం రావడం.. వారి సంపూర్ణ సహకారం ఉందని రాష్ట్రంలో చర్చ సాగుతోంది.
అందుకే ఏడు దశల పోలింగ్ ప్రచారం పూర్తయిన మరుక్షణమే ప్రజ్వల్ తిరిగి వచ్చారని అంటున్నారు. అంతేకాదు.. ఈ కేసులకు సంబంధించి బాధితులకు చేయాల్సిన న్యాయం
తెరచాటున ఇప్పటికే చక్కబెట్టేశారని.. రేపు వారు మీడియా ముందుకు వచ్చినా.. కోర్టుకు వచ్చినా.. ఈ కేసులో పెద్దగా సాక్ష్యాలు నిలిచేలా వ్యవహరించే పరిస్థితి లేదన్నది కూడా.. చర్చకు దారితీసింది. మొత్తంగా చూస్తే.. చేయాలని ఎరేంజ్‌మెంట్లు చేసేసిన తర్వాత.. ప్రజ్వల్‌ను తీసుకువచ్చారనేది మాత్రం నిర్వివాదంశమేనని చెబుతున్నారు.
This post was last modified on May 31, 2024 9:55 am
నిన్న కేరళలోని కొచ్చిలో ఘనంగా నిర్వహించిన 'పుష్ప 2: ది రూల్' ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, రష్మిక…
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉచిత ఇసుక పథకానికి గ్రహణం వీడడం లేదు. ఎన్నోసార్లు ఈ…
అతి తక్కువ గ్యాప్ లో తమ కుటుంబానికి సంబంధించిన రెండు శుభవార్తలు పంచుకున్న నాగార్జున ఇద్దరు కొడుకులు వైవాహిక జీవితాల్లోకి…
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి కాంట్రవర్సీలు లేని నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. అందుకే ఫాన్స్…
అమరావతిలో కొద్ది రోజుల క్రితం జరిగిన డ్రోన్ సమ్మిట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు…
థియేటర్లో కొత్తగా రిలీజైన సినిమాలే పైరసీ నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. అలాంటిది ఓటిటిలో హెచ్డి ప్రింట్లు వచ్చాక ఆగుతాయా. ఎంత సాంకేతికత…