ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ.. కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. వాస్తవానికి ఈ పిటిష న్‌పై ఇప్పటికే వాదనలు కూడా పూర్తయ్యాయి.
తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. అసలు పిటిషన్‌నే కొట్టివేయడం గమనార్హం. ఇది ఒకరకంగా సీఎం జగన్‌కు ఎదురుదెబ్బేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు.. హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో ఏబీవీకి లైన్ క్లియర్ అయింది. అయితే.. ఇప్పుడు ప్రభుత్వం ఆయన విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తగా మారింది. 2019లో జగన్ అధికారంలొకి వచ్చిన నాటి నుంచి ఏబీవీపై సస్పెన్షన్ విధించారు.
ఏబీవీ కుమారుడు ఇజ్రాయెల్‌తో కలిసి స్పై పరికరాల వ్యాపారం చేస్తున్నారని తొలుత పేర్కొంటూ.. ఆయనను సస్పెండ్ చేశారు. దీనిలో ఏబీవీ భాగస్వామ్యం ఉందన్నారు. అయితే.. ఇది నిలవలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విధుల్లోకి తీసుకున్నారు. తర్వాత రెండు రోజులకే.. ఆయనపై మరోసారి సస్పెన్షన్ వేటు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారంటూ.. అభియోగాలు నమోదు చేశారు. అయితే.. ఈ విషయంలో క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని క్యాట్ పేర్కొంది. సస్పెండ్ చేయడం సరికాదని తెలిపింది.
ఆయనను విధుల్లోకి తీసుకోవడంతోపాటు.. నిలిపివేసిన జీత భత్యాలు కూడా ఇవ్వాలని పేర్కొంది. కానీ, ఈ క్యాట్ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ పూర్తిగా కేసును పట్టించుకోలేదని.. ఏబీవీ చేసింది నేరమేనని.. ఆయనపై విచారణ కొనసాగుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని అభ్యర్థించింది. అయితే.. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ ను తాజాగా హైకోర్టు ధర్మాసనం పోచ్చింది.
ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టే సిన హైకోర్టు.. ఏబీవీకి తక్షణమే విధులు కేటాయించాలని ఆదేశించలేదు. అంతేకాదు.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కూడా సూచించలేదు. దీంతో సర్కారు ఏం చేస్తుందనేది వేచి చూడాలి. సుప్రీంకోర్టుకువెళ్తుందా.. లేక తప్పును దిద్దుకుని ఏబీవీనికరుణిస్తుందా? అనేది ఆసక్తిగామారింది. మరో వైపు ఈ నెల 31తో ఏబీవీ రిటైర్మెంట్ కానున్నారు.
This post was last modified on May 30, 2024 5:49 pm
నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న…
వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా…
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీఈఓ అనురాగ్ బాజ్పాయ్ అరెస్టయ్యారు. బోస్టన్ సమీపంలో ఉన్న వ్యభిచార గృహాల వ్యవహారంలో…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…