Political News

జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో నిందితుడికి బెయిల్‌!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారులోని సింగ్‌న‌గ‌ర్ ప్రాంతంలో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌నలో ప్ర‌ధాన నిందుతుడు(ఏ1) స‌తీష్‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించింది. విజ‌య‌వాడ‌లోని 8వ అద‌న‌పు జిల్లా కోర్టు ఆయ‌నకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్‌కు సంబంధించి కొన్ని ష‌ర‌తులు విదించింది. ప్ర‌తి శ‌నివారం, ఆదివారం సింగ్‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్‌లో హాజ‌రు కావాల‌ని.. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ముందు సంత‌కాలు చేయాల‌ని ఆదేశించింది. అదేవిధంగా రూ.50 వేల‌పూచీ క‌త్తు స‌మ‌ర్పించాల‌ని ష‌ర‌తులు విధించింది. కేసుకు సంబంధించి మీడియాకు ఎలాంటి ఇంట‌ర్వ్యూలు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కూడ‌ద‌ని.. మాట్లాడ‌రాద‌ని తేల్చి చెప్పింది.

అదేవిధంగా రాజ‌కీయ నేత‌ల‌తోనూ ఈ కేసు విష‌యంపై ఎలాంటి స‌మాచారాన్ని పంచుకోరాద‌ని కోర్టు ష‌రతుల్లో పేర్కొంది. దీంతో స‌తీష్‌కు బెయిల్ ల‌భించింది. కాగా, బెయిల్ మంజూరుకు సంబంధించిన పిటిష‌న్ల‌పై సుమారు వారం రోజుల పాటు.. ఈ కోర్టు విచార‌ణ చేసింది. అనంత‌రం.. తీర్పును మంగ‌ళ‌వారం వెలువ‌రించింది. ఇదిలావుంటే.. ఎన్న‌కల ప్ర‌చారంలో భాగంగా సీఎం జ‌గ‌న్ మేమంతా సిద్దం బ‌స్సు యాత్ర నిర్వ‌హించారు. క‌డ‌ప‌లో ప్రారంభ‌మైన ఈ యాత్ర ఏప్రిల్ 13న విజ‌య‌వాడ శివారు.. సింగ్‌న‌గ‌ర్‌కు చేరుకుంది. అయితే.. రాత్రి స‌మ‌యంలో ఇక్క‌డ ఆయ‌న రాయిదాడి జ‌రిగింది. ఆయ‌న‌తో పాటు మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు కంటికి కూడా గాయ‌మైంద‌ని స‌ర్కారు తెలిపింది.

ఈ విష‌యంపై రాజ‌కీయ దుమారం కూడా రేగింది. ప్ర‌తిప‌క్షం టీడీపీ సీఎం జ‌గ‌న్‌పై హ‌త్యాయ‌త్నం చేయించింద‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపించారు. అయితే.. జ‌గ‌న్ కు త‌గిలింది గుల‌క‌రాయి మాత్ర‌మేన‌ని దీనిని రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఈ వివాదం నెల రోజు పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రి వాద‌న వారు వినిపించారు. ఈ క్ర‌మంలో కొంద‌రు పోలీసులు కూడా బ‌దిలీ అయ్యారు. అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు చివ‌ర‌కు స‌తీష్ అనే యువ‌కుడి ప్ర‌మేయం ఉంద‌ని గుర్తించి అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. తాజాగా ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది.

This post was last modified on %s = human-readable time difference 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ ఠాకూర్ లక్కు బాగుంది

తెలుగు ఎంట్రీని సీతారామం రూపంలో ఘనంగా జరుపుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ఆ తర్వాత హాయ్ నాన్న కూడా…

1 hour ago

కొండా సురేఖపై కోర్టు ఆగ్రహం

మాజీ మంత్రి కేటీఆర్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో…

2 hours ago

షర్మిల పై రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత…

2 hours ago

ఎమ్మెల్యేల దూకుడుకు బ్రేకులు.. చంద్ర‌బాబు కొత్త వ్యూహం!

టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత చెబుతున్నా.. వినిపించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న సీఎం చంద్ర‌బాబులో క‌నిపి స్తోంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రెండు కీల‌క…

3 hours ago

గేమ్ ఆడబోతున్న బాలయ్య & చరణ్

గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ…

3 hours ago

నాని కి ఇచ్చిపడేసిన షర్మిల

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌.. తాజాగా సంచ‌ల‌న లేఖ ఒక‌టి మీడియాకు విడుద‌ల చేశారు. దీనిలో ప్ర‌ధానంగా ఆమె…

4 hours ago