ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమరంలో కొందరు నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు చివరి ఎన్నికలంటూ.. చెప్పుకొచ్చారు. వీరిలో వైసీపీ, టీడీపీకి చెందిన హేమా హేమీ నాయకులు వున్నారు. మరి వారు ఈ ఎన్నికల్లో సక్సెస్ అవుతారా? వారు ప్లే చేసిన సెంటిమెంటు వర్కవుట్ అవుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వారు చివరి ఎన్నికలు అన్నా.. ఓటరు దేవుడు ఎలా కరుణించాడనేది.. ఇప్పుడు ఆసక్తిగా మారింది.
కొడాలి నాని: గుడివాడ నుంచి నాలుగుసార్లు గెలుపు గుర్రం ఎక్కారు. ఈ ఎన్నికలను ఆయన చివరి ఎన్నికలుగా పేర్కొన్నారు. ఈ సారి తప్ప.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. అప్పటికి తనకు వయసు కూడా పెరుగుతుందని చెప్పారు. అదే విషయాన్ని ఆయన ఊరూ వాడా ప్రచారం కూడా చేశారు. అయితే.. ఇక్కడ భారీ ఓటింగ్ జరిగింది. దీంతో ఏమేరకు ఈ సెంటిమెంటు పండిందనేది ప్రశ్న. టీడీపీ నుంచి బరిలో ఉన్న వెనిగండ్ల రాము మాత్రం అభివృద్ధి మంత్రం పఠించారు. దీంతో ఇక్కడ సెంటిమెంటు వర్కవడం కష్టమనే వాదన ఉంది.
అయ్యన్నపాత్రుడు: మాజీ మంత్రి అయ్యన్న నర్సీపట్నం నుంచి పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఈయన కూడా.. ఇవి తనకుచివరి ఎన్నికలని ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన వారసుడు వస్తాడని.. ఈ సారికి గెలిపించాలని వేడుకున్నారు. అయితే. వైసీపీ నుంచి బలమైన నాయకుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. ఈయన తాను చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. దీంతో ఫైట్ ఎటు పక్షం ఉందనేది ఆసక్తిగా మారింది.
బండారు: టీడీపీ నుంచి చివరి నిముషంలో పట్టుబట్టి మరీ టికెట్ దక్కించుకున్న సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి. ఈయన పెందుర్తి అడిగితే.. చంద్రబాబు ఆయనకు మాడుగుల నియోజకవర్గం కేటాయించారు. అయిష్టంగానే అక్కడకు వెళ్లిన బండారు.. ఇదే తనకు చివరి ఎన్నికలని చెప్పారు. ఇంతకు మించి ఆయనకు చెప్పడానికి కూడా ఏమీలేదన్న గుసగుస కూడా వినిపించింది. ఇక్కడ నుంచి మంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె లక్ష్మి పోటీలో ఉన్నారు. అదేసమయంలో బూడి పెద్ద భార్య కుమారుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు.
గంటా: టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు.. భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక్కడ కూడా ఆయన పట్టుబట్టి సాధించారు. అయితే.. ఏమనుకున్నారో ఏమో.. ఆయనకు కూడా ఇవి తనకు చివరి ఎన్నికలని ప్రచారం చేసుకున్నా రు. వైసీపీ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోరు హోరా హోరీగా సాగిందనేది పోలింగ్‌ను బట్టి తెలుస్తోంది. మరి గంటాసెంటిమెంటు ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
కొణతాల: జనసేన నుంచి అనకాపల్లి నియోజకవర్గంలో పోటీ చేసిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా.. ఈ సారి తనకు చివరి ఎన్నికలని ప్రచారం చేశారు. ఇక్కడ నుంచి తొలిసారి రాజకీయ అరంగేట్రం చేసిన.. వైసీపీ యువనేత భరత్ ఉన్నారు. ఇద్దరి మధ్యా పోరు భీకరంగానే సాగింది. అటు సీనియర్ నాయకుడు, ఇటు యువ నేత.. మధ్య ఓట్లు ఎటు పడ్డాయనేది ఆసక్తికరం.
పెద్దారెడ్డి: తీవ్ర విధ్వంసానికి దారి తీసిన అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి పోటీలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా.. ఈ దఫా ఇదే తన కు చివరి ఎన్నికలని ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ యువ నేత జేసీ అస్మిత్ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరూ రెడ్లే కావడం.. ఇద్దరూ ఫైర్ బ్రాండ్లే కావడంతో ఇక్కడ ఎవరు విజయం దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on May 27, 2024 12:20 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…