పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు 400 సీట్లు రావాలని బీజేపీ పెద్దలు లక్ష్యం గా పెట్టుకున్నారు. దీనినే పదే పదే ప్రచారం కూడా చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లారు… అబ్ కీ బార్ చార్ సౌ పార్(ఈసారి 400 సీట్లు) అంటూ.. ప్రచారం ఊదర గొడుతున్నారు. కానీ, దేశంలో నెలకొన్న పరిస్థితులు.. పరిణామాల నేపథ్యంలో బీజేపీకి అన్ని సీట్లు రావడం కష్టమని.. కీలక సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ కూడా గ్రహించింది. అందుకే తమతో కలిసి వస్తామన్న ప్రతి ప్రాంతీయ పార్టీని భుజాలపై ఎక్కించుకుంది.
ప్రస్తుతం యోగేంద్ర యాదవ్, బ్రెమ్మెర్ వంటి కీలక సెఫాలజిస్టులు చెబుతున్న అంచనాల ప్రకారం మోడీ కి వ్యక్తిగతంగా అంటే బీజేపీకి.. 220-230 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇంతకు మించే ఛాన్స్ లేదని.. ఎంతలేదని చెబుతున్నా.. ప్రస్తత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బాగానే పోరాడుతోందని.. దేశవ్యాప్తంగా మైనారిటీ ఓటు బ్యాంకు ఇండియా కూటమి వైపే ఉందని చెబుతున్నారు.
అలానే.. ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకును చీల్చేందుకు మోడీ ప్రయత్నించినా.. సాధ్యం కావడం కష్టమే నని.. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని.. ఉత్తరాదిలోనూ.. రైతులు మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని.. దీంతో బీజేపీకి 220 సీట్లు వస్తే..ఎక్కువ వచ్చినట్టేనన్నది వీరి అంచనా. ఒకవేళ వీరి అంచనాలే కనుక నిజమైతే.. బీజేపీలో కూటమి పార్టీలకు రెక్కలు వచ్చినట్టేనని లెక్కలు వేస్తున్నారు. వీరిలోనూ ప్రధానంగ దక్షిణాదిలో టీడీపీ, జనసేన కూటమి నుంచి 15-18 సీట్లుకనుక వస్తే.. ఈ పార్టీలకు కేంద్రంలో దన్ను పెరుగుతుందని చెబుతున్నారు.
ఎన్డీయే కూటమి పార్టీల్లో ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఈ స్థాయిలో సీట్లు రావని.. అందుకే.. ఏపీ పైనే ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు మరో సారి కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి వచ్చినా రావొచ్చన్నది సెఫాలజిస్టుల అంచనాగా ఉంది. పూర్తిస్థా యిలో కాకపోయినా.. చంద్రబాబు మాటకు అయితే.. కేంద్రంలో వాల్యూ పెరుగుతుందని అంటున్నారు.
బిహార్.. వంటి చోట్ల జేడీయూతో బీజేపీ కలిసినా. అక్కడ 7-8 సీట్లు మాత్రమే జేడీయకు వస్తాయని అంటున్నారు. దీంతో ఏపీలో వచ్చే సీట్లపై బీజేపీ ఆధారపడడం ఖాయమనిలెక్కలు వేస్తున్నారు. ఫలితంగా చంద్రబాబు కేంద్రంలో కీలక రోల్ పోషించే అవకాశం ఉండొచ్చన్నది వీరి మాట. ఏం జరుగుతుందనేది జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on May 26, 2024 4:07 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…