టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తెలంగాణకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి బాలయ్య ఆయనను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైకి ఇది సాధారణ సమావేశమే అని అనుకుం టున్నా.. కీలకమైన విషయాలు చర్చించేందుకు నందమూరి వచ్చి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించేందుకు రెండేళ్లుగా బాలయ్య ప్రయ త్నిస్తున్నారు. ఏపీలోనూ దీనిని నెలకొల్పాలని అనుకున్నరు. అయితే.. అక్కడ గత ఎన్నికల్లో ప్రభుత్వం మారిపోయిన తర్వాత కుంటుపడింది. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో నూతనంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ అంతా రెడీ అయింది. తద్వారా మూడు రాష్ట్రాల రోగులకు దీనిని మరింత అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక ప్రాంత రోగులకు మరిన్ని అధునాతన సౌకర్యాలతో ఈ కేన్సర్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారులో జాగా కేటాయింపు..(గతంలో కేసీఆర్ ను కూడా అడిగారు) సహా ఇతర అనుమతుల విషయంపై సీఎం రేవంత్ ను నేరుగా కలిసి ఉంటారని చర్చ. అదేసమయంలో హైదరాబాద్‌లోని రామకృష్ణా సినీ స్టూడియోస్‌ను ఆధునీకరించను న్నారు. దీనిని మణికొండకు షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. దీనిపై కూడా.. సీఎంకు సమాచారం అందించి.. తగు విధంగా భూమిని కోరినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. బాలయ్య పర్యటన వెనుక.. చాలా వ్యవహారాలు ఉన్నయని అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 26, 2024 1:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…