ప్రస్తుత ఎన్నికల్లో జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఎన్ని గెలుస్తారనే విషయంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. కొందరు నాలుగు అంటుంటే.. మరికొందరు.. సగం ఖాయమని లెక్కలు వేస్తున్నారు. సరే… ఈ వాదన ఎలా ఉన్నప్పటికీ.. పోటీలో ఉన్నవారు మాత్రం బలమైన నాయకు లే.. దీంతో మొత్తంగా గెలిచినా ఆశ్చర్యంలేదని మరికొందరు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గమనిస్తే… 19-20 స్థానాలు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదనేది వాస్తవమే.
ఉదాహరణకు పిఠాపురంలో పవన్ విజయం ఖాయమైందని. కేవలం మెజారిటీ మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. వాటలో ఒకవైపు అభ్యర్థుల బలం.. మరోవైపు పార్టీ బలం రెండూ కలిపి.. జనసేనకు కలిసి వస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి బుద్ధ ప్రసాద్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. అలానే.. బీమవరంలో పులపర్తి రామాంజనేయులు కూడా.. గెలుపు గుర్రం ఎక్కినట్టేనని అంటున్నారు.
ఇక, భీమవరం, తాడేపల్లి గూడెం, అనకాపల్లి ఇలా.. మొత్తం 19-20 స్థానాల్లో జనసేన గెలుపు గుర్రం ఎక్కేందుకు చాలా వరకు అవకాశం ఉందని లెక్కలు వస్తున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. స్థానికంగా ఉన్న కుల సమీకరణలు.. వ్యక్తుల బలాబలాలు వంటివి కూడా కలిసి వస్తున్నాయి. దీంతో జనసేన కు 20 స్థానాల్లో పక్కా విజయం నమోదవుతుందని చెబుతున్నారు. ఒక్క నెల్లిమర్ల స్థానం మినహా.. ఇతర నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమని అంటున్నారు.
ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఈ అంచనా కనుక సాక్షాత్కరిస్తే.. ఖచ్చితంగా అది పవన్‌కు తిరుగులేని శక్తి ని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. ఇటు ప్రభుత్వంలో.. ఆయన మాటకు మరింత వాల్యూ పెంచుతుంది. అదేవిధంగా పార్టీ పరంగా మరింత పుంజుకునేందుకూ అవకాశం ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. పార్టీ కి ఇప్పటి వరకు ఎదురైన గాజు గుర్తు సమస్య కూడా.. పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. మొత్తానికి 19-20 సీట్లు కనుక జనసేన తెచ్చుకుంటే.. తిరుగులేని చక్రం తిప్పడం ఖాయంగానే కనిపిస్తోంది.
This post was last modified on May 28, 2024 7:10 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…