ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. గట్టిగానే ప్రచారం చేసుకున్నా రు. పార్టీ ఏఐసీసీ చీఫ్‌మల్లికార్జున ఖర్గే నుంచి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరకు కీలక నేతలను తెచ్చు కుని కడపలో ప్రచారం చేయించారు. సబలు పెట్టారు. సెంటిమెంటు కురిపించారు. ఎవరూ ఊహించని విధంగా కరడు గట్టిన ప్రత్యర్థులు కూడా టార్గెట్ చేయలేని విధంగా సీఎం జగన్‌ను.. దునుమాడారు. తీవ్ర వ్యాఖ్యలతో ఇరుకున పెట్టారు. బాబాయి హత్య నుంచి మహిళల రక్షణ వరకు కూడా ఆమె టచ్ చేయని అంశం లేదు.
దీనికి తోడు వివేకా కుటుంబం పూర్తిగా షర్మిల వైపు నిలబడింది. సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మలు కూడా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా షర్మిలకు ప్రచారం చేశారు. ఇక, చివరి రోజు.. వైఎస్ విజయమ్మ కూడా వీడియో సందేశం ఇచ్చారు.బ్రదర్ అనిల్ లోపాయికారీగా.. చర్చిల్లో ప్రచారం చేశారనే వార్తలు వచ్చాయి. ఆయన ఖండించినా.. ఇది నిజమనని క్షేత్రస్థాయిలో తెలిసింది. ఇక, షర్మిల మూడు నుంచి నాలుగు సార్లు.. వివిధ సందర్భాల్లో ప్రజల ముందే కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి ఎన్నడూలేని విధంగా కడప పార్లమెంటు పరిధిలో ఓటర్లను ఒక కుదుపు కుదిపేశారు.
దీంతో షర్మిల విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే.. కీడెంచి మేలెంచమ న్నట్టుగాషర్మిల గెలిస్తే.. ఓకే.. ఒకవేల గెలవకపోతే.. ఏం చేస్తారు? అనేది చర్చ. ఇది కూడా నాణేనికి మరోవైపు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి చర్చించుకోవడం తప్పుకాదు. ఇదే జరిగితే.. ఆమె మరో రాహుల్ గాంధీ అవుతారనే చర్చ సాగుతోంది. వాస్తవానికి కడప పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ.. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకు.. ఉంది. బంధుగణం కూడా ఉంది. వీరంతా షర్మిలకు అనుకూలమేనా? అంటే చెప్పడం కష్టం.
అందుకే.. షర్మిల ఓడితే.. అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. మరో ఐదేళ్లపాటు షర్మిల మరిన్ని కష్టాలు ఎదుర్కొనక తప్పేలా కనిపించడం లేదు. పైగా.. ఓటు బ్యాంకు పెరిగినా.. అది అధికారాన్ని అందించే స్థాయికి చేర్చుకునేలా ఉండదు. కాబట్టి..ఇది షర్మిల ఓటమికి మరింత ఇబ్బందిగా మారి.. మరో సమస్యగా కూర్చునే చాన్స్ ఉంటుంది. ప్రభుత్వంపై పోరాటం చేసినా.. ఇంతకన్నా ఎక్కువగా చేసే అవకాశం లేదు. పైగా ఓడిపోతే.. ఆ సింపతీ కూడా.. మిగిలే పరిస్థితి ఉండదు. సో.. అప్పుడు మరోసారి పాదయాత్ర చేయడమో.. లేక మరో వ్యూహంతో ముందుకు రావడమో షర్మిల ముందు ఉంటుంది. మరి ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి ఆమె గెలవాలనే కోరుకుంటున్నవారు ఎక్కువగా ఉండడం గమనార్హం.
This post was last modified on May 26, 2024 1:11 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…