ఉమ్మడి కడప జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట అనే విషయం తెలిసిందే. అయితే.. ఈసారి ఇదే వైఎస్ కుటుంబంలో తలెత్తిన వివాదంతో.. అన్నా చెల్లె ళ్లు చీలిపోయారు. దీంతో ఇక్కడ రాజకీయ దుమారం రేగింది. ఫలితంగా.. ఇక్కడ సీఎం జగన్‌కు పెద్ద పరీక్ష పెట్టినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ‘జగన్ ఓడిపోవడం కుదిరే పని కాదు. ఇది ఎవరూ చేయలేరులే… కానీ, ఆయనకు మెజారిటీ తగ్గినా ఓడిపోయినట్టే కదా!’ అని అంటున్నారు స్థానికులు.
నిజానికి అప్రతిహత విజయంతో ముందుకు సాగుతున్న జగన్.. గత ఎన్నికల్లో ఏకంగా 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ దక్కించుకుని రాష్ట్రంలోనే మెజారిటీ ఎక్కువ దక్కించుకున్న నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డును ఈ సారి ఆయన అధిగమించలేక పోవచ్చనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన గెలుపు ఖాయమే అయినా… ముప్పేట దిగ్బంధించిన ఇతర పార్టీల కారణంగా జగన్ మెజారిటీ తగ్గుతుందని చెబుతున్నారు.
టీడీపీనుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు. ఈయన ఇక్కడ చిరపరిచితుడు. పైగా..మూడు రాజధానులకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్సీ సీటును తృణప్రాయంగా వదులుకున్నారు. దీంతో చాలా వరకు సింపతీ గెయిన్ చేశారు. ఫలితంగా మెజారిటీ ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది. అయితే..ఈయన దక్కించుకునే ఓట్లన్నీ కూడా.. సీఎం ఖాతాలోవేనని చెబుతున్నారు. ఇది ఒకరకంగా వైసీపీ అధినేతకు ఇబ్బందిగా మారనుంది. ఇది భారీ మెజారిటీని తగ్గిస్తుందని అంటన్నారు.
ఇక, కాంగ్రెస్ కూడా ఈ దఫా ఇక్కడ బలమైన సెంటిమెంటునే రాజేసింది. జగన్ సోదరి షర్మిల.. ఇక్కడ కొంగు పట్టి ఓట్లు అడిగారు. అయితే.. ఇది సెంటిమెంటును రాజేయడంతో ఆమె ఒక్కరికే కాకుండా.. గ్రామీణ ప్రజలు కనుక మొగ్గు చూపి ఉంటే..పులివెందుల సీటులో కూడా.. కాంగ్రెస్‌కు ఓట్లు పడతాయని చెబుతున్నారు. ఇదే జరిగితే.. మరింతగా సీఎం జగన్‌కు డ్యామేజీ జరిగి.. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ 90 వేలలో సగం లేదా.. అంతకన్నా ఓట్లు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 26, 2024 12:31 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…