Political News

యువ‌గ‌ళం తెచ్చే ఓట్లెన్ని? లెక్క‌లు ఇవీ..!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ గ‌త ఏడాది 2023, జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువగ‌ళం పాద‌యాత్ర‌.. రాష్ట్రంలో దుమ్మురేపింది. ఎక్క‌డో చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప్రారంభించిన ఈ యాత్ర‌.. అనేక ఇబ్బందులు.. అనేకానేక విరామాల అనంతరం.. విశాఖ‌ప‌ట్నంలో ముగిసింది. మ‌ధ్య మ‌ధ్య అనేక వివాదాలు కూడా త‌లెత్తాయి. మొత్తానికి యాత్ర‌ను ముగించారు. అయితే.. దీనివెనుక మూడు ల‌క్ష్యాలు ఉన్నాయి. మ‌రి ఇవి ఏమేర‌కు స‌క్సెస్ అయ్యాయి అనేది ఈ ఎన్నిక‌లు తేల్చ‌నున్నాయి.

1) రాష్ట్ర‌నేతగా గుర్తింపు: నారా లోకేష్ ను రాష్ట్ర స్థాయి నాయ‌కుడిగా గుర్తింపు పొందేలా చేయాల‌నేది ఈ పాద‌యాత్ర వెనుక ఉన్న అంత‌ర్వ్యూహం. ఎందుకంటే.. ఇప్పుడు కాక‌పోతే.. మ‌రో ఐదేళ్ల‌లో అయినా.. ఆయన పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల్సి ఉంది. పార్టీని న‌డిపించాల్సి ఉంటుంది. దీంతో ఆయ‌న‌ను రాష్ట్ర స్థాయి నాయ‌కుడిగా చేయాలంటే.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం ముఖ్యం. ఈ నేప‌థ్యంలోనే పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. మ‌రి ఆయ‌న‌ను ప్ర‌జ‌లు రాష్ట్ర‌నేత‌గా గుర్తించారా? అనేది ప్ర‌శ్న‌.

2) వైసీపీకి చెక్‌: పాద‌యాత్ర ద్వారా.. వైసీపీకి చెక్ పెట్టాల‌నేది మ‌రో ముఖ్య వ్యూహం. సీమ ప్రాంతంలోనే పాద‌యాత్ర ఎక్కువ‌గా సాగింది. టీడీపీకి ప‌ట్టున్న ఉత్త‌రాంధ్ర‌లో లైట్ అయిపోయింది. కానీ, వైసీపీకి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాలుగా ఉన్న చోట మాత్రం ఎక్క‌డా పాద‌యాత్ర వెనుక‌డుగు వేయ‌కుండా.. ప్ర‌తి మండ‌లాన్నీ చుట్టి వ‌చ్చింది. అంటే.. ఆయా స్థానాల్లో వైసీపీ బ‌లాన్ని త‌గ్గించాల‌నేది యువ‌గ‌ళం వ్యూహం. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అయింది. వైసీపీ ఓటు బ్యాంకు ను త‌గ్గిస్తుందా.. సీట్ల‌ను త‌గ్గిస్తుందా? అనేది చ‌ర్చ‌.

3) పార్టీ నేత‌ల‌పై ప‌ట్టు: యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా.. టీడీపీపై ప‌ట్టు పెంచుకునేందుకు.. సీనియ‌ర్లు, జూనియ‌ర్ నేత‌ల‌పైనా ప‌ట్టు పెంచుకునేందుకు నారా లోకేష్ ప్ర‌య‌త్నించారు. ఎక్క‌డ ఎలాంటి ప‌రిస్థితి ఉంది? అనే విష‌యాన్ని ఆయ‌న తెలుసుకునేందుకు ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర ద్వారా ప్ర‌య‌త్నించారు. మ‌రి ఇవ‌న్నీ.. ఈ ఎన్నిక‌లు తేల్చేయ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలిచినా.. సీమ‌లో వైసీపీకి సీట్లు త‌గ్గినా… ప్ర‌జ‌లు ఆయ‌న‌ను రాష్ట్ర నేత‌గా గుర్తించిన‌ట్టేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on May 25, 2024 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

47 minutes ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

7 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

8 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

10 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

12 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

12 hours ago