ఏపీలో మరో వివాదం తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎస్ లు ఇవ్వాలని.. ప్రమోషన్ కల్పించాలని కోరుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యూపీఎస్సీకి సిఫార్సు చేశారు. ఇది రాజకీయంగా వివాదం రేపింది. దీనిపై విదేశాల్లో ఉన్న చంద్రబాబు లేఖ రాశారు. నేరుగా యూపీఎస్సీ కి చంద్రబాబు లేఖ సంధించారు. వాళ్లంతా జగన్ కార్యాలయం మనుషులని పేర్కొన్నారు. ఇలా కొందరికి మాత్రమే ప్రమోషన్ ఇవ్వడం సరికాదని చంద్రబాబు తెలిపారు.
కేవలం కొందరిని మాత్రమే ఎంపిక చేసి.. ఇలా ప్రమోషన్ ఇవ్వడం రాజకీయ దురుద్దేశమని పేర్కొన్నారు. దీనిలో పారదర్శకత లోపించిందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రమోషన్ల ప్రక్రియను నిలువరించాలని కోరారు. అదేసమయంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అసలు ఇలా ప్రమోషన్‌లు ఇవ్వాలని సిఫారసు చేయడం కూడా.. నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. తక్షణం ఈ ప్రక్రియలను నిలుపుదల చేయాలని చంద్రబాబు కోరారు. అంతేకాదు.. ఇలా సిఫారసు చేసిన జవహర్‌రెడ్డి పై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జూన్ 4న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పటి వరకు ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని కూడా చంద్రబాబు తన లేఖ లో కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అప్పటి వరకు.. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని సూచించారు. పారదర్శకత లోపించడం.. అయిన వారికి ప్రమోషన్లు ఇవ్వడం వంటివి నిస్సందేహంగా ఖండించాల్సిన అంశాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా.. పలువురు అధికారులను ఐఏఎస్‌లుగా ప్రమోషన్ చేయాలని కోరుతూ.. జవహర్‌రెడ్డి రెండు రోజుల కిందట అత్యంత రహస్యంగా యూపీఎస్సీకి లేఖ రాశారు.
This post was last modified on May 24, 2024 10:22 pm
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…