తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కు ఇవ్వాలంటూ.. స్వరాలు ప్రారంభమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసి.. మరో పదిరోజుల్లో ఫలితం రానున్న నేపథ్యంలో వ్యూహాత్మకమో.. అనూహ్యమో తెలియదు కానీ.. ఇప్పుడు టీడీపీ జాతీయ పగ్గాలను.. నారా లోకేష్‌కు ఇప్పగించాలన్న డిమాండ్లు.. స్వరాలు తెర మీదికి వస్తున్నాయి. కొన్ని రోజుల కిందట.. బండారు.. కూడా ఇలానే వ్యాఖ్యానించారు. నారా లోకేష్‌ను జాతీయ అధ్యక్షుడిగా చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి వారు కూడా.. ఎ న్నికల ప్రచార సమయంలో ఇదే మాట చెప్పుకొచ్చారు. చం ద్రబాబును ఉన్నత పదవిలో చూడాలని ఉందని.. నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇస్తే.. తాము చూడాలని.. ఆయన వెంట నడవాలని కోరుకుంటున్నట్టు నారా లోకేష్ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఇటు.. కింజరాపు కుటుంబం.. కళా కుటుంబాలు కూడా. నారా లోకేష్ కోసం చూస్తున్నాయి. అయితే.. ఇతర నేతలు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో బయట పడలేదు. ఎవరూ సంచలన వ్యాఖ్యలు కూడా చేయలేదు.
కానీ, ఇప్పుడు విజయవాడకు చెందిన కీలక నాయకుడు బుద్ధా వెంకన్న మాత్రం.. నారా లోకేష్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చూడాలని.. దేశం నేతలు కోరుకుంటున్నారని.. ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జూన్ 4న కూటమి గెలుస్తుదని.. జూన్ 9న చంద్రబాబు అమరావతిలో ఏపీముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని.. అదే రోజు నారా లోకేష్‌కు పగ్గాలు అప్పగించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. పార్టీ నాయకుడుగా తాను కూడా అదే కోరుకుంటున్నట్టు చెప్పారు.
వాస్తవానికి నాయకుల మాట ఎలా ఉన్నా.. చంద్రబాబు కూడా.. పార్టీ పగ్గాలు నారా లోకేష్‌కు అప్పగించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి గత ఏడాది నిర్వహించిన మహానాడులోనే అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత.. దీనిపై క్లారిటీకి కూడా వచ్చారు. అయితే.. ఇక్కడ పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే.. టీడీపీ పగ్గాలు.. వచ్చే రెండుమూడేళ్లలో అయినా.. నారా లోకేష్‌కు ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on May 24, 2024 3:14 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…