టీడీపీ అధినేత చంద్రబాబు కనుక తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకువస్తే.. దానిలో తనకు ఒక పేజీని ఖచ్చితంగా కేటాయిస్తారని.. పార్టీసీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకురావా లని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబుకు తాను పెద్దకొడుకు వంటి వాడినని చెప్పారు పార్టీ కోసంచంద్రబాబు రాష్ట్రంలో కష్టపడ్డారని.. తాను విజయవాడలో పార్టీకోసం పనిచేశానని అన్నారు.
పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినట్టు బుద్దా వెంకన్న అన్నారు. అందుకే చంద్రబాబు ఆత్మకథ పుస్తకంలో తనకంటూ.. ఒక పేజీని ఖచ్చితంగా ఉంచుతారని.. దానిలో తనకు-చంద్రబాబుకు మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివరిస్తారని చెప్పారు. ఇదిలావుంటే.. చంద్రబాబు ఇప్పటి వరకు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశారని.. కానీ, ఇప్పుడు పార్టీకి ముగ్గురు జమా జట్టీల్లాంటి నాయకులు లభించారని తెలిపారు.
నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రాను న్నట్టు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ వీరు ప్రచారం చేశారని అన్నారు. వచ్చే ఫలితాలు కేవలం టెక్ని కల్ మాత్రమేనని.. కూటమికి 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయని.. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని బుద్ధా చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలు.. ఉచిత రవాణా.. గ్యాస్ బండలు వంటివాటికి మహిళలు ముగ్ధులయ్యారని.. అందుకే అర్ధరాత్రి వరకు కూడా క్యూ కట్టిమరీ పోలింగ్ బూత్‌లలో కూటమికి ఓటేశారని ఆయన వివరించారు. వైసీపీ అరాచకాలు ఇకపై సాగబోనివ్వమని.. వైసీపీలో ఉన్న రౌడీలు రాష్ట్రం వదలి పారిపోవాలని.. ఆయన హెచ్చరించారు. జూన్ 4 తర్వాత.. వేటాడతామని చెప్పారు.
This post was last modified on %s = human-readable time difference 12:27 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…