తెలంగాణ ఇచ్చామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అగ్రనేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీ వచ్చే నెల 2న(పోలింగ్ ఫలితానికి రెండు రోజుల ముందు) తెలంగాణకు రానున్నారు. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
2013-14 మధ్య యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ ఇచ్చినప్పటికీ.. సుదీర్ఘ పోరాటాల అనంతరం.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినప్పటికీ.. తొలి దశాబ్దం మాత్రం కాంగ్రెస్‌కు ఇక్కడి ప్రజలు జై కొట్టలేదు.
దాదాపు 10 ఏళ్త తర్వాత గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు జై కొట్టారు. దీంతో కాంగ్రెస్‌కు ఒకింత ఊపు వచ్చింది. ఒకవైపు ఉత్తరాదిని పార్టీ ఇబ్బందులు పడినప్పటికీ.. దక్షిణాదిలో తెలంగాణ ఆ పార్టీకి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ వేడుకలకు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆవిర్భావ దినోత్సవం రోజున సోనియాగాంధీ చేత తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గీతాన్ని విడుదల చేయనుంది. “జయ జయ హే తెలంగాణ” అనే గీతాన్ని ప్రముఖ కవి అందె శ్రీ రచించారు. ఈ గీతాన్ని ఫిబ్రవరి 4న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ అధికారికంగా ఆమోదించింది. ప్రస్తుత సందర్భాన్ని ప్రతిబింబించేలా గీతంలో స్వల్ప మార్పులను మంత్రి వర్గం సూచించింది. దాదాపు 1.5 నిమిషాల నిడివి గల తుది వెర్షన్ అందుబాటులోకి వచ్చింది.
జయజయ హే తెలంగాణ.. గీతానికి సంగీతాన్ని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచారు. ఈ గీతాన్ని సోనియా గాంధీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా తెలంగాణ తల్లి ప్రతిమలోనూ మార్పులు చేశారు. దీనిని కూడా సోనియా చేతుల మీదే ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే.. సోనియా తన ప్రసంగంలో రాష్ట్ర ఏర్పాటు.. నాటి ఆకాంక్షలు.. ఇప్పటికీ తీరని సమస్యలను ప్రస్తావిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సోనియా రాకతో.. తెలంగాణలో కాంగ్రెస్‌కు మరింత ప్రాభవం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on May 22, 2024 10:35 pm
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…